తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు
గుంటూరు : పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు భవిష్యత్ లో ప్రాధాన్యత ఉంటుందని
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. యువ
నాయకుడు వల్లూరి కిరణ్ రూపొందించిన “చంద్రన్న సైనికుడు” డైరీని ఉండవల్లిలోని
తన నివాసంలో చంద్రబాబు ఆవిష్కరించారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే
బలమని,ఆవిర్భావం నుంచి పార్టీలో యువతకు తగు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు.
అలాగే పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు భవిష్యత్ లో తగిన ప్రాధాన్యత
ఉంటుందన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ జెండా దించకుండా
పనిచేస్తున్న కార్యకర్తల సేవలు అమూల్యమైనవన్నారు. ఈ సందర్భంగా డైరీ
రూపొందించిన వల్లూరి కిరణ్ ను ప్రత్యేకంగా చంద్రబాబు అభినందించారు. భవిష్యత్
లోనూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు.