గిడుగు రుద్రరాజుకు ఖర్గే ఆదేశం
విజయవాడ : దేశంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న కుటిల రాజకీయాలను
ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ శ్రేణులను సన్నద్దం చేయాలని అఖిల భారత జాతీయ
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ సీనియర్
నేత, మాజీ శాసనమండలి సభ్యులు, ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజుతో
అన్నారు. ఇటీవల నూతనంగా కాంగ్రెస్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన
ఖర్గేను గిడుగు రుద్రరాజు న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో బుధవారం
మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఒడిశా
రాష్ట్ర ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్న క్రమంలో ఓడిశాతో పాటు ఆంధ్రప్రదేశ్
రాష్ట్రాల్లోని పార్టీ పరిస్థితులపై ఖర్గే ఆరా తీశారు. ప్రస్తుతం దేశంలో
కొనసాగుతున్న అప్రకటిత ఎమర్జెన్సీ గురించి ప్రజలకు తెలిసేలా ప్రచారం
చేయాలన్నారు. భారతీయ జనతా పార్టీ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న
ప్రయత్నాలను యువ నేత రాహుల్‌గాంధీ ధైర్యంగా అడ్డుకుంటున్నారని తెలిపారు.
ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పార్టీ బోలోపేతం కోసం తీసుకుంటున్న
చర్యలను ఈ సందర్భంగా రుద్రరాజు ఖర్గేకు వివరించారు.