హైదరాబాద్ : భారాసను క్షేత్రస్థాయిలో పటిష్ఠం చేసే దిశగా మంత్రి కేటీఆర్
పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈమేరకు భారాస జిల్లా అధ్యక్షులు,
జనరల్ సెక్రటరీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారాసను క్షేత్రస్థాయిలో
పటిష్ఠం చేసే దిశగా మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
భారత రాష్ట్ర సమితిని మరింత బలోపేతం చేస్తూ 60లక్షల మంది పార్టీ శ్రేణులను
చైతన్య పరిచేలా విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని భారాస అధినాయకత్వం ప్రణాళిక
రూపొందించింది. పార్టీలో పనిచేసే కింది స్థాయి కార్యకర్త నుంచి
ప్రజాప్రతినిధులు, రాష్ట్రస్థాయి నేతల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేసే
విధంగా కార్యక్రమాలు రూపకల్పన చేయాలని దిశానిర్దేశం చేశారు. ఆత్మీయ సమ్మేళనాల
ఏర్పాటుకు ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రతి 10 గ్రామాలను ఒక
యూనిట్‌గా తీసుకుని ఎమ్మెల్యేలు, పార్టీ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనాలు
నిర్వహించాలన్నారు. భారాస జిల్లా అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలతో మంత్రి
కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ప్రజాప్రతినిధులు వీలైనంత వరకు ప్రజల్లోనే ఉండాలన్నారు. జిల్లాల్లో పార్టీ
కార్యాలయాలన్నీ ప్రారంభించుకోవాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలను
విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను
ఘనంగా నిర్వహించడంతో పాటు, ఏప్రిల్ 25న నియోజకవర్గాల్లో పార్టీ ప్రతినిధుల
సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని శ్రేణులకు కేటీఆర్ సూచించారు.