విజయవాడ : పార్లమెంటు వ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్నారని, దీనివలన
ప్రపంచానికి చెడు సాంకేతాలు వెళ్తున్నాయని ఏఐసిసి అధికార ప్రతినిధి ప్రొఫెసర్
రాజీవ్ గౌడ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విజయవాడ ఆంధ్ర రత్న భవన్లో
జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు తో కలిసి
మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో పార్లమెంటును బ్రష్టు పట్టించింది ఎవరని
ఆయన మోడీని ప్రశ్నించారు. జేపీసీ వేయకుండా ఆదానీ విషయంలో ప్రశ్నలకు సమాధానం
ఇవ్వకుండా, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయటం పెద్ద కుట్రని ఆయన ఆరోపించారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు నిర్ణయం తీసుకున్న బిజెపిని
త్వరలోనే దేశ ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. నీరవ్ మోడీ ,లలిత మోడీ,
నరేంద్ర మోడీ నిజంగా దొంగలని ప్రొఫెసర్ రాజు గౌడ నొక్కి చెప్పారు. గౌతమ్ అధానీ
స్కాముల గురించి అడిగితే రాహుల్ గాంధీ పై వేటువేయటం ప్రజాస్వామ్యాన్ని
కించపరచడమేనని అన్నారు. సెబీ, ఇతర సంస్థలను మోసపూరిత దారిలో అతి పెద్ద
దోపిడీకి పథకం వేసి దేశ ఆర్థిక వ్యవస్థను చిన్న బిన్నం చేశారని ఆరోపించారు.
అదా ని, అంబానీలను తనతో పాటు ప్రాన్స్ కి తీసుకు వెళ్లిన మోడీ నిజాలను బయట
పెట్టాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో నగర అధ్యక్షులు నరహరిశెట్టి
నరసరావు, నిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, వి గురునాథం, తాంతియా కుమారి,
మేడ సురేష్, మీసాలు రాజేశ్వర రావు, ఖాజా మొహిద్దిన్, కొలనుకొండ శివాజీ, కొరివి
వినయ్ కుమార్, డాక్టర్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.