ఆగస్టు 8న ‘అవిశ్వాసం’పై పార్లమెంట్లో చర్చ
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను మణిపుర్ అంశం కుదిపేస్తోంది.
మణిపుర్‌పై చర్చతోపాటు, ప్రధాని ప్రకటనకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ
క్రమంలోనే మంగళవారం మరోసారి ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్‌సభ ప్రారంభమైన
తర్వాత కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి దిల్లీ
ఆర్డినెన్స్‌పై ప్రకటన చేశారు. ‘‘బిల్లును హోంశాఖ నిబంధనలకు అనుగుణంగా
రూపొందించింది. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైందని కేజ్రీవాల్ బృందం గుర్తుంచుకోవాలన్నారు. ఈ
క్రమంలో మణిపుర్ అంశంపై చర్చకు ఇండియా కూటమి సభ్యులు పట్టుబడుతూ నినాదాలు
చేయడంతో, సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ ఓం
బిర్లా ప్రకటన చేశారు. రాజ్యసభలో సైతం ఇది పరిస్థితి తలెత్తింది. సభ ప్రారంభం
కాగానే మణిపుర్ ఘటనపై చర్చ జరగాలని, ప్రధాని సభలో ప్రకటన చేయాలని ప్రతిపక్ష
కూటమి సభ్యులు నినాదాలు చేశారు. ఒకే అంశంపై చర్చకు పట్టుబడుతూ సభకు అంతరాయం
కలిగించొద్దని ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ విపక్ష సభ్యులకు సూచించారు. మణిపుర్
అంశంపై నిన్న చర్చ జరగాల్సి ఉందని, అది జరగలేదని తెలిపారు. ఈ క్రమంలో విపక్ష
కూటమి సభ్యులు నినాదాలు చేస్తుండటంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.
విపక్ష ఎంపీలు ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై
చర్చించేందుకు తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 8 నుంచి మూడు రోజుల పాటు చర్చ
జరగనుంది. ఆగస్టు 10వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. లోక్‌సభ
సభా వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈశాన్య రాష్ట్రం
మణిపుర్లో జాతుల మధ్య వైరం జరుగుతోంది. దానిపై ప్రకటన చేసేందుకు మోడీ
పార్లమెంట్‌కు రావాలని గత కొద్దిరోజులుగా విపక్షాలు పట్టుబడుతున్నాయి. దాంతో
ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. దీనిపై హోం మంత్రి అమిత్ షా
బదులిస్తారని ప్రభుత్వం చెప్పినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు. ఈ
కీలక అంశంపై ప్రధానే స్పందించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే
విపక్షాలు అవిశ్వాస అస్త్రాన్ని ఉపయోగించాయి.
కనీవినీ ఎరుగని ఘోరం : లోక్‌సభలో అధికార ఎన్డీఏ కూటమికి పూర్తి స్థాయి
మెజార్టీ ఉంది. విపక్షాల కూటమి ఇండియాకు 144 మంది సభ్యులు ఉన్నారు. ఈ
తీర్మానంపై విజయం సాధించడం సాధ్యం కాదని తెలిసినప్పటికీ మణిపుర్‌పై ప్రధాని
స్పందించాలనే లక్ష్యంతోనే దీనిని ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానాన్ని
చర్చకు చేపట్టకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఇదివరకు విపక్షాలు చేసిన
ఆరోపణలను బీజేపీ ఖండించింది. తమకు మూడింట రెండొంతుల మెజారిటీ ఉందని కేంద్ర
మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. బిల్లులను ప్రవేశపెట్టడానికి ముందే
అవిశ్వాస తీర్మానాన్ని చేపట్టాలనే నిబంధనేమీ లేదని, 10 రోజుల్లోగా ఎప్పుడైనా
చేపట్టవచ్చని చెప్పారు.
మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చకు తేదీల ఖరారు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష కూటమి
ఇండియా ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 8, 9, 10 తేదీల్లో చర్చ
జరుగుతుంది. ఈ తీర్మానంపై మోదీ ఈ నెల 10న సమాధానం చెబుతారు. కాంగ్రెస్ ఎంపీ
గౌరవ్ గొగోయ్ సమర్పించిన అవిశ్వాస తీర్మానం నోటీసును లోక్ సభ సభాపతి ఓం బిర్లా
గత నెల 26న అనుమతించిన సంగతి తెలిసిందే. మణిపూర్‌లో మే 3 నుంచి హింసాత్మక
ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ సమస్యపై పార్లమెంటులో
మాట్లాడాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఆయన ఈ డిమాండ్‌ను
పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర
రావు లోక్ సభలో అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. ప్రతిపక్ష ఇండియా కూటమికి
ఎంపీల బలం ఉండటంతో కాంగ్రెస్ ఎంపీ ఇచ్చిన నోటీసును స్పీకర్ ఓం బిర్లా
అనుమతించారు. మణిపూర్ సమస్యపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం చెబుతారని
ప్రభుత్వం చెప్పింది. అవిశ్వాస తీర్మానంపై చర్చ ద్వారా తాము ప్రజల మనసు
గెలుస్తామని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. అయితే ఈ తీర్మానం లోక్ సభలో వీగిపోయే
అవకాశం ఉంది. 543 మంది సభ్యులు ఉండే లోక్ సభలో ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 331 మంది ఎంపీల బలం ఉంది. ప్రతిపక్ష ఇండియా
కూటమికి 141 మంది ఎంపీలు ఉన్నారు. ఈ రెండు పక్షాలకు చెందనివారు సుమారు 60 మంది
ఉన్నారు.