హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్గా హరీశ్చౌదరి నియమితులయ్యారు. ఈమేరకు ఏఐసీసీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హరీశ్చౌదరి చండీగఢ్, పంజాబ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నారు. స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ ఆధ్వర్యంలో తెలంగాణలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.