రాళ్లను గాల్ స్టోన్స్ అంటారు. ఈ గాల్ స్టోన్స్ చిన్నగా ఉంటే సమస్య ఉండదు
కానీ, ఇవి పెద్దగా అయితే కడుపు కుడి పైభాగాన నొప్పి వస్తుంది.
పిత్తాశయం పని:
మనం తీసుకునే ఆహారంలోని కొవ్వు పదార్థాలు జీర్ణం అయ్యేందుకు పైత్యరసం అవసరం.
లివర్ నుంచి విడుదల అయ్యే పైత్యరసాన్ని గాలాడర్ నిల్వ ఉంచుతుంది.
కొలెస్ట్రాల్, బైలిరుబిన్ మోతాదులు ఎక్కువగా ఉండటంతో రాళ్లు ఏర్పడతాయి. వీటిని
కరించెందుకు ఏం తినాలో ఇప్పుడు చూద్దాం..
పసుపు:
పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి.
పసుపులోని ఔషధ గుణాలు బైల్ సాల్యుబులిటీని మెరుగుపరుస్తాయి. ఇది పిత్తాశయంలోని
రాళ్లను కరిగిస్తుంది. తేనెలో పసుపు కలుపుకొని తాగడంతో మంచి ఫలితాలు పొందవచ్చు.
ముల్లంగి:
ముల్లంగి రసం తాగడంతో పిత్తాశయంలో రాళ్లు కరుగుతాయి. ముల్లంగి కొలెస్ట్రాల్ ను
సైతం సులభంగా కరుగుతుంది. గాల్ స్టోన్స్ సమస్యతో బాధపడేవారు రెగ్యులర్ గా
మల్లంగి రసం తాగడంతో చిన్న రాళ్లు తొలగుతాయి.
బీట్ రూట్:
బీట్ రూట్ లో ఫైబర్, కెరోటినాయిడ్స్, ప్లేవనాయిడ్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఇవి లివర్ పనితీరును
పెంచుతాయి. గాల్ స్టోన్స్ సమస్య నుంచి ఉపశమనం అందిస్తాయి.
గ్రీన్ టీ:
గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కావాల్సిన శక్తిని
అందిస్తాయి. ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి. గ్రీన్ టీని రెగ్యులర్ గా
తీసుకోవడంతో పిత్తాశయంలో రాళ్ల కరుగుతాయి. రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీ
తాగడంతో మంచి ఫలితాలు పొందుతాయి.
కొబ్బరి నూనె:
కొబ్బరినూనెలో మంచి కొవ్వులు అధికంగా ఉంటాయి. ఆపిల్ రసంలో మూడు టేబుల్ స్పూన్ల
కొబ్బరినూనె, నిమ్మరసం, వెల్లుల్లి కలుపుకొని తాగడంతో పిత్తాశయంలో రాళ్లు
కరుగుతాయి.
క్రాన్ బెర్రీ జ్యూస్:
ప్రతిరోజూ క్రాన్ బెర్రీ జ్యూస్ తాగడంతో పిత్తాశయంలో రాళ్లు సులభంగా
కరుగుతాయి. క్రాన్బెర్రీస్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ
పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
నిమ్మరసం:
నిమ్మరసంలో విటమిన్ సి కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది పిత్తాశయంలో రాళ్లు
ఏర్పడకుండా చూస్తుంది. ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చటి నీటితో నిమ్మరసం కలిపి
తాగడంతో మంచి ఫలితాలు పొందవచ్చు.