విజయవాడ : ప్రెస్ అకాడమి సెక్రటరీ మామిడిపల్లి బాలగంగాధర్ తిలక్ ను జర్నలిస్టు
సంఘం ఏపీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి చందు జనార్థన్ మంగళవారం ప్రెస్ అకాడమి,
విజయవాడ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టు
యూనియన్ రూపొందించిన డైరీని ప్రెస్ అకాడమి సెక్రటరీ బాలగంగాధర్ తిలక్ లకు
బహుకరించారు. ఈ సంధర్బంగా బాలగంగాధర్ తిలక్ మాట్లాడుతూ త్వరలో విజయవాడ ప్రెస్
క్లబ్ లో ప్రెస్ అకాడమి ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు సూచనల మేరకు
అనుభవజ్ఞులైన పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ముప్పవరపు వెంకట నారాయణ,
పిడియాట్రిక్స్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల పిల్లల కోసం ఉచిత హెల్త్ క్యాంప్ ను
నిర్వహించాలని కోరినట్లు తెలిపారు. హెల్త్ క్యాంప్ కోసం తేదిని నిర్ణయించి
సహకారం అందించాలని జర్నలిస్టు సంఘం ఏపీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి చందు
జనార్థన్ ని ప్రెస్ అకాడమి సెక్రటరీ కోరారు.