ఆదాడి మల్లికార్జునరావు
విజయవాడ : కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో, కే .జి .బి. వి లలో గతంలో
పనిచేస్తున్న( పిజిటి& సి.ఆర్.టి) ఉపాధ్యాయులు, అధ్యాపకుల ను తిరిగి విధుల్లో
కొనసాగించాలని నూతనంగా ఇచ్చిన నోటిఫికేషన్ లో గతంలో చేసిన గెస్ట్ ఫ్యాకల్టీలను
పిజిటి , సిఆర్టి లను కొనసాగిస్తూ కొత్తవారిని మిగిలిన ఖాళీలలో భర్తీ చేయాలని,
స్థానిక గాంధీనగర్ ధర్నా చౌక్ లో జరిగిన ధర్నాలో జై భీమ్ దళిత సేన ఎస్సీ ఎస్టీ
బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆదాడి మల్లికార్జునరావు డిమాండ్
చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ తెలుగు ఇంగ్లీష్ ఫ్యాకల్టీ
లను, క్రమబద్ధీకరణ చేసి తిరిగి వారి ఉద్యోగాలు వారికి ఇవ్వాలని కేజీబీవీ లలో
గెస్ట్ ఫ్యాకల్టీ లను (పిజిటి, సి ఆర్ టి) లను కాంట్రాక్టు పద్ధతిలో
కొనసాగిస్తూ తద్వారా ఉద్యోగ భద్రత కల్పించాలని, కోరారు. ఈ కార్యక్రమంలో ఎం. సి
.అంకమ్మ, ఎస్ .అనిత ,పి. ఝాన్సీ ,జుబెదా బేగం. బి. అనిత ,ఎం .హరిత, యు. రమణమ్మ
తదితరులు పాల్గొన్నారు.