కథానాయిక తమన్నా ,నటుడు విజయ్ వర్మ రియల్ లవ్ స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్. ఈ
జంట తమ ప్రేమను బాహాటంగానే ఒప్పుకుంటున్నారు. అంతేకాదు ఇద్దరు గాఢ ప్రేమలో
మునిగి తేలుతున్నారు. ఇప్పటి వరకు పలు ఇంటర్వ్యూలో తమ ప్రేమ గురించి
చెబుతూనేవున్నారు. తాజాగా విజయ్ వర్మ మరోసారి ఈ విషయంపై మాట్లాడారు. ‘మా లవ్
స్టోరీ గురించి మా గురించి తెలుసుకోవడానికి అందరూ ఎంతో ఆసక్తిగా వున్నారు.
అందరి ఆదరణ అభినందనలు పొందిన జంటల్లో మేము కూడా వున్నామనేది నాకు ఇప్పటి వరకు
తెలియదు. అంత “మంది ఆదరణ సొంతం చేసుకున్నందుకు సంతోషంగా వుంది. మేమిద్దరం
ప్రేమలో పడిన కొత్తలో బయటికి వెళ్లినప్పుడు అందరి దృష్టి మా మీద పడటం,
వ్యక్తిగత జీవితం అందరిలో డిస్కషన్ పాయింట్ గా వుండటం అసౌకర్యంగా ఫీలయ్యా.
రాను రాను నేను కూడా దానికి అలవాటు పడ్డాను. ఏది ఏమైనా ‘తమన్నాతో నేను
పీకల్లోతు ప్రేమలో మాత్రం వున్నాను’ అని విజయ్ చెప్పుకొచ్చారు. ‘విజయ్ తన
జీవితంలో ఎంతో స్పెషల్ పర్సన్ అని, నాకు కష్టం వస్తే నాతోనే వుంటాడనే నమ్మకం
వుందని’ తమన్నా పలు సార్లు చెప్పిన సంగతి తెలిసిందే.