నరసన్నపేట, ఫిబ్రవరి 10 : ప్రపంచంలోనే ఆర్థికంగా బలమైన దేశంగా భారత్ ను రూపొందించడంలో మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు తన చివరి శ్వాస వరకు శ్రమించారని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. పి.వి నరసింహరావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పీవీ వేసిన ఆర్థిక సంస్కరణల పునాదుల ఫలంగానే నేడు భారతదేశం ప్రపంచంలోనే ఆర్థికంగా నాలుగవ బలవంతమైన దేశంగా రూపుదిద్దుకుందన్నారు. గొప్ప రాజనీతిజ్ఞుడు, బహుభాషా కోవిదుడు స్వర్గీయ పీవీ నరసింహారావు గారికి భారతరత్న దక్కడం తెలుగు ప్రజలందరికి గర్వకారణంగా భావిస్తున్నామన్నారు.