రష్యా : ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విమర్శలు
ఎదుర్కొంటున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. తాజాగా ఆయన విదేశీ
రాయబారులనుద్దేశించి ప్రసంగిస్తే ఎవరూ చప్పట్లు కొట్టకపోవడం గమనార్హం. రష్యా
అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ఇబ్బందికర అనుభవం ఎదురైంది. ఓ అధికారిక
కార్యక్రమంలో ఆయన ప్రసంగం తర్వాత అక్కడున్న ఏ ఒక్కరూ చప్పట్లు కొట్టలేదు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే
ఇటీవల రష్యా కు నూతనంగా నియమితులైన 17 దేశాల రాయబారులు గత బుధవారం పుతిన్ ను
అధికారికంగా కలిశారు. గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో
విదేశీ రాయబారులనుద్దేశించి పుతిన్ కొద్దిసేపు ప్రసంగించారు. ఈ సందర్భంగా
అమెరికా, ఐరోపా దేశాల నూతన రాయబారులపై రష్యా అధ్యక్షుడు విమర్శలు గుప్పించారు.
ఉక్రెయిన్ పై సైనిక చర్య ప్రారంభించిన తర్వాత రష్యాతో పశ్చిమ దేశాల సంబంధాలు
దెబ్బతినడానికి ఆ దేశాల రాయబారులే కారణమని ఆరోపించారు. రష్యాకు అమెరికా నూతన
రాయబారి లైని ట్రేసీని ఉద్దేశిస్తూ 2014లోని ఉక్రెయిన్ తీర్మానానికి అమెరికా
మద్దతివ్వడమే ప్రస్తుత సంక్షోభానికి దారితీసిందని వ్యాఖ్యానించారు.అయితే పుతిన్ ప్రసంగం ముగిసిన తర్వాత అక్కడున్నవారెవరూ చప్పట్లు కొట్టలేదు.
చప్పట్ల కోసం పుతిన్ కొంతసేపు నవ్వుతూ ఎదురుచూసినప్పటికీ రాయబారుల నుంచి
ఎలాంటి స్పందన రాలేదు. దీంతో పుతిన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. క్రెమ్లిన్,
రష్యా అధికారిక మీడియా ఈ వీడియోను కాస్త ఎడిట్ చేసి విడుదల చేసినప్పటికీ
పుతిన్ విమర్శకులకు ఈ వీడియో దొరికింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు
సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది. రష్యా స్వతంత్ర మీడియా సంస్థ మెడుజా
ప్రసారం చేసిన ఈ వీడియోను ఉక్రెయిన్ హోం మంత్రిత్వ శాఖ సలహాదారు ఆంటన్
గెరాషెంకో తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ పుతిన్‌పై వ్యంగ్యాస్త్రాలు
గుప్పించారు. అటు మెడెజా ఎండీ కూడా దీనిపై స్పందిస్తూ ‘‘గతేడాది జరిగిన విదేశీ
రాయబారుల కార్యక్రమంలోనూ పుతిన్ ప్రసంగానికి ఎవరూ చప్పట్లు కొట్టలేదు. అయితే
అప్పుడు కూడా క్రెమ్లిన్ ఆ వీడియోను కట్ చేసి బయటకు విడుదల చేసిందని
తెలిపారు.