చెన్నై : పలు ప్రాంతాలకు 53 మంది లబ్ధిదారులకు పునరావాస కేటాయింపు ఉత్తర్వులు, కారుణ్య మొత్తాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ అందించారు. కొళత్తూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. తమిళనాడు అర్బన్ హాబిటాట్ డెవెలప్మెంట్ బోర్డు తరఫున వీటిని అందజేశారు. రాజా తోట్టం, గౌతమపురం ప్రాజెక్టు ప్రాంతాల్లోని బాధితులు లబ్ధి పొందారు. కార్యక్రమంలో మంత్రులు కేఎన్ నెహ్రూ, శేఖర్‌బాబు, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ మేయర్ ప్రియ తదితరులు పాల్గొన్నారు.