గుంటూరు : శాస్త్ర సాంకేతిక రంగాలలో సాధిస్తున్న పురోగతి ఫలితంగా సులభతర
అంతర్జాతీయ వ్యాపారం సాధ్యమైందని ఆచ్యార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి
అచార్య పట్టేటి రాజశేఖర్ అన్నారు. విశ్వవిద్యాలయం ఇంటర్నేషనల్ బిజినెస్
స్టడీస్ విభాగం నేతృత్వంలో ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ గ్లోబల్ బిజినెస్ అనే
అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల సదస్సును శుక్రవారం ఉపకులపతి
ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్ధులు అంతర్జాతీయంగా
జరుగుతున్న మార్పులను నిరంతరం అధ్యయనం చేయాలన్నారు. ఈ తరహా సదస్సులు
కొత్తవిషయాల పట్ల ఆసక్తిని పెంపొందించటానికి ఉపకరిస్తాయని సూచించారు.
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఇప్పడు ప్రతి విషయంలోనూ కిలక పాత్రను
పోషిస్తుందన్నారు. సదస్సు సంచాలకులు, విశ్వవిద్యాలయం కామర్స్, బిజినెస్
అడ్మినిస్ట్రేషన్ విభాగ అధిపతి అచార్య ఆర్. శివరామ ప్రసాద్ మాట్లాడుతూ
అంతర్జాతీయంగా వ్యాపార అవకాశాలకు కొదవ లేదని, సరైన సమయంలో సరైన వేదిక నుండి
వాటిని నిర్వహించగలగాలని తెలిపారు. సుస్ధిరతకు మార్గం చూపే సృజనాత్మక ఐడియాలకు
కొదవ లేదన్నారు. ఐఐఎం అహ్మదాబాద్ ఫ్రోఫెసర్ ఆచార్య నరసింహన్ రవిచంద్రన్
మాట్టాడుతూ సాంకేతికలో వచ్చిన మార్పులు ప్రపంచగతినే మార్చివేస్తున్నాయన్నారు.
వినియోగదారుని అభిరుచులకు అనుగుణంగా ప్రపంచ వ్యాపార పోకడలు నిత్యం
నూతనత్వాన్ని అపాదించుకుంటున్నాయన్నారు. సేవారంగం ప్రపంచాన్ని శాసిస్తుందని,
సగటు మనిషి వ్యయం ఊహించని విధంగా మారిపోతుందని, తదనుగుణంగా మరిన్ని సేవలను
వినియోగదారుడు ఆశిస్తున్నాడని అన్నారు. లక్నో ఐఐఎం ఫ్రోఫెసర్ అచార్య ఎస్
వెంకట్ మాట్టాడుతూ అంతర్జాతీయ వ్యాపార రంగంలో సప్లయ్ చైన్ మేనేజ్ మెంట్ కీలక
భూమిక పోషిస్తుందన్నారు. ఇంటర్నేషనల్ బిజినెస్ ను అభ్యసించే ప్రతి ఒక్కరూ
ఆదునిక సాంకేతికను సైతం అలవరుచుకోవాలన్నారు. మిజోరాం సెంట్రల్ యూనివర్శిటీ
నుండి అచార్య ఎన్విఆర్ జ్యోతి కుమార్ మాట్టాడుతూ అంతర్జాతీయ వ్యాపార రంగలో
సృజనాత్మకత పెద్దపీట వేస్తుందన్నారు. అచార్య ఎన్ జి రంగా వ్యవసాయ
విశ్వవిద్యాలయం అగ్రిబిజినెస్ విభాగ అధినేత అచార్య సత్యగోపాల్ మాట్లాడుతూ
అగ్రి బిజినెస్ లో విస్రృత అవకాశాలు ఉన్నాయని, వ్యవసాయరంగంలో ఆధునీకరణ
ఫలితంగా ప్రస్తుతం పలు మార్సులు చోటుచేసుకుంటున్నాయని వివరించారు. పాండిచ్చేరీ
సంట్రల్ యూనివర్సిటీ నుండి అచార్య శ్రీనివాసులు మాట్టాడుతూ రానున్న రోజులలో
సాంకేతికత క్రీయాశీలకం కానుందన్నారు. శనివారం కూడా జరగనున్న ఈ సదస్సులో
దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల నుండి పలువురు అచార్యులు ప్రసంగించనున్నారు.