ఈబీసీ రిజర్వేషన్లు 5 శాతం నేటి వరకు ఎందుకు అమలు చేయలేదు
బలిజలకు కేటాయిస్తున్న రాజంపేట ఎంపీ సీటును మిథున్ రెడ్డి కేటాయించిన మాట నిజం
కాదా?
జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్
విజయవాడ పశ్చిమ : కాపుల సంక్షేమం కోసం న్ని నిధులు ఖర్చు చేశారో శ్వేత పత్రం
విడుదల చేయాలని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ డిమాండ్
చేశారు. ఆదివారం విజయవాడ వన్ టౌన్లో జనసేన నేత పోతిన వెంకట మహేష్
ఆధ్వర్యంలో కాపు సామాజిక వర్గ నేతలతో ఆత్మీయ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
కాపు సామాజిక వర్గం నేతలు జనసేన పార్టీ తరఫున పెద్దన్న పాత్ర పోషించాలి. పదే
పదే పవన్ కళ్యాణ్‌పై అసత్య ప్రచారం చేస్తున్న వారిని బలంగా తిప్పి కొట్టాలని
మహేష్ అన్నారు. “కాపు సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి కాకూడదన్న వైసీపీ
కుట్రలను ఛేదించాలని ఈబీసీ రిజర్వేషన్లు 5 శాతం నేటి వరకు ఎందుకు అమలు
చేయలేదని, కాపు కార్పొరేషన్ పెట్టింది కేవలం జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్‌పైన
విమర్శలు చేయడానికేనా. కాపుల అభివృద్ధి, సంక్షేమం కోసం జగన్ ఎన్ని నిధులు
ఖర్చు చేశారు. 10 వేల కోట్ల వినియోగంపై శ్వేత పత్రం విడుదల చేయాలని మహేష్
డిమాండ్ చేశారు.
జనసేన పార్టీ మీ సొంత ఇల్లు లాంటిది. వైయస్సార్సీపి హయంలో విదేశీ విద్యను
రద్దుచేసి 2500 మంది కాపు విద్యార్థుల భవిష్యత్తుకు హాని కలిగించారు. కాపు
భవనాలు ఒక్కటి నిర్మించలేదు. జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ని పదేపదే
విమర్శిస్తున్న వైసీపీ కాపు నాయకులు ఇంతవరకు కాపుల అభివృద్ధి సంక్షేమం గురించి
గానీ, కాపు కార్పొరేషన్ గురించి గానీ ఎందుకు మాట్లాడటం లేదని పోటీనా మహేష్
ప్రశ్నించారు. మెగా కుటుంబానికి, వంగవీటి కుటుంబానికి ఒక్కరోజు కూడా సేవ
చేయకుండానే ఎమ్మెల్యేలు నేడు ఇష్టానుసారము వారి కుటుంబాలను విమర్శలు
చేస్తున్నారని, వాళ్ల అర్హత, స్థాయి ఏంటో ఒకసారి గుర్తించాలన్నారు.
స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు సాంప్రదాయ బద్ధంగా బలిజలకు
కేటాయిస్తున్న రాజంపేట ఎంపీ సీటును మిథున్ రెడ్డి కేటాయించిన మాట నిజం కాదా?.
పులివెందుల పంచాయితీ సర్పంచ్ బలిజలు ఉండేవాళ్ళు. వైయస్ జగన్ రెడ్డి, ఆయన
కుటుంబం రాజకీయాల్లోకి వచ్చాక పులివెందులలో బలిజలను అణగదొక్కారు. రాయలసీమ
నెల్లూరు ఐదు జిల్లాల్లో 62 ఎమ్మెల్యే స్థానాలకు గాను ఒక్కటి మాత్రమే
బలిజలకు కేటాయించారు. జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ ని, విమర్శిస్తూ జనసేన
జెండా దిమ్మలను కూల్చేవాడు మనవాడు ఎలా అవుతాడని అన్నారు. ఈ కార్యక్రమంలో
పాలేటి మోహనరావు , బొబ్బూరి కొండలరావు ,కమ్ముల నాగేశ్వరరావు, రాయల్ పవన్,
బావిశెట్టి శ్రీనివాస్ , బేతాళం రవికుమార్, పులి చేరి రమేష్, పోలిశెట్టి శివ,
అడపా చిన్న, తిరుపతి సురేష్, తాట్రాజుల నరేష్ కుమార్ , పెటేటి నాంచారయ్య ,
చలమలశెట్టి శ్రీనివాస్ , బండి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.