ఆంగ్ల విద్యను అడ్డుకున్న చంద్రబాబు చరిత్రహీనుడు
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతీరావ్ పూలేకు ఘన నివాళులు
గుంటూరు : మహాత్మాజ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం తాడేపల్లి వైయస్సార్
కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.
జ్యోతిరావుపూలే విగ్రహానికి రాష్ట్ర మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ,
జోగి రమేష్, ప్రభుత్వ విప్లు జంగా కృష్ణమూర్తి, డొక్కామాణిక్యవరప్రసాద్,
ఎమ్మెల్యే కే.పార్థసారధి, ఎమ్మెల్సీలు మురుగుడు హనుమంతరావు, లేళ్ళ
అప్పిరెడ్డిలు పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర
సమాచారశాఖమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ సమాజంలో అంతరాలు అంతం
కావాలంటే ఔషధం అవసరం అని, ఆ ఔషధమే విద్య అని గుర్తించిన వ్యక్తి మహాత్మా
జ్యోతీరావు పూలే అని కొనియాడారు. బాలికల విద్య విషయంలో ఆయన భార్య
సావిత్రిభాయిపూలే ఎనలేని సేవలు అందించారు. పూలే ఆశించిన విధంగా పేదవర్గాలకు
విద్యను చేరువ చేసే దిశగా ముఖ్యమంత్రి జగన్ అనేక పథకాలు అమలు
చేస్తున్నారన్నారు. ఫీజురీయంబర్స్ మెంట్ ద్వారా ఆనాడు మహానేత డాక్టర్
వైఎస్ రాజశేఖరరెడ్డి పేద విద్యార్థులకు ఉన్నత చదువును అందిస్తే ఇప్పడు ఆయన
తనయుడు వైఎస్ జగన్ దాన్ని మరింత మెరుగ్గా కొనసాగిస్తున్నారన్నారు.
రాష్ట్ర గృహనిర్మాణ శాఖమంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతీరావుపూలే
ఆశయాలను,లక్ష్యాలను తూచతప్పకుండా జగన్ అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు
చెందిన విద్యార్దులు నేడు దేశ,విదేశాల్లో ఉన్నతఉద్యోగాలు చేస్తున్నారంటే
దానికి కారణం వైయస్సార్ అమలు చేసిన ఫీజురీయంబర్స్ మెంటే కారణమన్నారు.
బిసిలను మరింతగా అభివృద్ది పధంలోకి తీసుకువెళ్తున్న సామాజిక న్యాయనిర్మాత,
అభినవపూలే జగన్ అని కొనియాడారు. కార్యక్రమంలో నవరత్నాల ప్రోగ్రామ్ వైస్
ఛైర్మన్ నారాయణమూర్తి, వివిధ కార్పోరేషన్ల ఛైర్మన్లు తోలేటి శ్రీకాంత్,
కాకుమాను రాజశేఖర్, కనకారావు మాదిగ, ప్రభుత్వ సలహాదారు నారమల్లిపద్మజ,
పార్టీ కార్యకర్తల సమన్వయకర్త పుత్తా ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.