బాలాయపల్లి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి బాలాయపల్లి కి చేసిన సేవలు నేటికీ మరువలేమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకు లు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని జయంపు గ్రామం ఎస్సీ కాలనీలో నేతిరుమల్లి జనార్దన్ రెడ్డి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్, జయింపు సహకార సంఘం అధ్యక్షుడు వెందొట్టి కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ప్రతి పల్లెకు రోడ్డు ఏర్పాటు చేసి ఆ పల్లెలకు బస్సు సౌఖ్యం ఏర్పాటు చేసిన ఘనత ఆయనదేనన్నా
రు.అంతేకాకుండా బ్రిడ్జిలు, కల్వర్టులు, సీసీ రోడ్లు ప్రజా సంక్షేయం కోసం అనేకమైన సేవలు అందించిన ఘనత ఆయనదేనన్నారు అందుకని నేటికీ ఆయన జ్ఞాపకాలు మరువ లేకుండా ఉండారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
పోటో:- జయంపు గ్రామంలో జనార్దన్ రెడ్డి వేడుకలు