తిరుపతి : పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన సోమవారం
ఉదయం పెద్ద శేష వాహనసేవలో నాలుగు ఆధ్యాత్మిక పుస్తకాలను టిటిడి జెఈవో
వీరబ్రహ్మం ఆవిష్కరించారు. వీటిలో శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రాల్లో అత్యంత
ప్రామాణికమైన ‘ఉత్సవ సార సంగ్రహము -1మరియు 2 ‘, ‘ సహస్ర కలశ స్థాపనము ‘ అనే
గ్రంథాలున్నాయి. ప్రాచీన తాళపత్ర నిధి నుండి డాక్టర్ రేజేటి వెంకట
వేణుగోపాలాచార్యులు శ్రీపాంచ రాత్ర ఆగమ శాస్త్ర గ్రంథాలను అనువదించి
ముద్రించారు. ఇందులో పాంచరాత్రాగమానుసారం స్వామి, అమ్మవార్ల ఉత్సవాలు, స్నపన
తిరుమంజనం, సహస్ర కలశ స్నపన ప్రాశస్త్యం తదితర వివరాలు ఉన్నాయి. మరో గ్రంథం
డాక్టర్ ఐఎల్ఎన్ చంద్రశేఖర రావు రచించిన ‘తిరుమల తొలిగడప దేవుని కడప’.
ఇందులో పూర్వం కడప నుండి తిరుమలకు వచ్చేవారు తొలిగడపైన దేవుని కడప శ్రీ
వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని తిరుమల చేరుకునేవారు. తాళ్లపాక
అన్నమాచార్యులు కూడా దేవుని కడప శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ వ్రాసిన
కీర్తనల వివరాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో విజివోలు మనోహర్, బాల్ రెడ్డి,
ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి విభీషణ శర్మ , ఉప సంపాదకులు డాక్టర్
నరసింహాచార్య పాల్గొన్నారు.