తాడేపల్లిగూడెం : జనసేన పవన్ కళ్యాణ్ పెళ్లి బిజెపితో కాపురం టిడిపి తో
చేస్తూ మూడుముక్కలాట ఆడుతున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ
శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లా
రణస్థలంలో గురువారం జనసేన పార్టీ నిర్వహించిన యువభేరి సభలో ఆ పార్టీ అధినేత
పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంపై మంత్రి కొట్టు పశ్చిమగోదావరి జిల్లా
తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడుతూ నిప్పులు చెరిగారు. భారతదేశ ఖ్యాతిని
ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన స్వామి వివేకానంద జయంతి రోజున సభను ఏర్పాటు చేసి
యువతకు నువ్వు ఇచ్చే సందేశం ఇదేనా అంటూ పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. పవన్
ప్రసంగం అంతా పచ్చి అబద్దాలతో కొనసాగింది అన్నారు సినిమా డైలాగులతో చంద్రబాబు
రాసి ఇచ్చిన స్క్రిప్ట్ తో ఊగిపోతూ ఆవేశంగా మాట్లాడినంత మాత్రాన ప్రజలు
సహించరన్నారు 2009లో వైయస్ రాజశేఖర్ రెడ్డి తో పోరాడానని చెబుతున్న పవన్
కళ్యాణ్ కు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి కారకులైన వారి
అంతు చూస్తానని జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఏమయ్యాయని
కొట్టు సూటిగా ప్రశ్నించారు. ఆనాడు ప్రజారాజ్యం బ్రతుకు ఉంటే తెలుగుదేశం
చచ్చిపోతుందని చంద్రబాబు కుట్ర చేసి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం
చేసేంతవరకు నిద్ర పోలేదన్నారు అటువంటి చంద్రబాబును వదిలేసి నేడు వైకాపాతో
జగన్తో యుద్ధం అని ప్రకటించడం పవన్ రాజకీయ అవివేకానికి దిగజారుడుతనానికి
నిదర్శనమని మంత్రి కొట్టు విమర్శించారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న
తెలుగుదేశం పార్టీని పవన్ కళ్యాణ్ ఏనాడైనా ప్రశ్నించాడా నిలదీశాడా? అని
అడిగారు.అసలు పవన్ కళ్యాణ్ కు బుర్ర పని చేస్తుందా? సినిమాలో డైలాగులు
మాదిరిగా వీడిని ఎవరికైనా చూపించండి రా బాబు అనేది నూటికి
నూరు శాతం పవన్ కళ్యాణ్ కు వర్తిస్తుంది అన్నారు. ఉత్తరాంధ్ర
డెవలప్మెంట్ బోర్డ్ ఏర్పాటు చేస్తానని పవన్ కళ్యాణ్ ఈలలు చప్పట్లు తప్ప నాకు
ఓట్లు వేస్తారని నమ్మకం లేదని చెప్పటానికి జనసేన అధికారంలోకి వచ్చేది ఎప్పుడు
చేసేది ఎప్పుడని మంత్రి కొట్టు ఎద్దేవా చేశారు. కోస్తా తీర ప్రాంతంలో వైసీపీ
ప్రభుత్వం ఏడు ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు
చేశారు. దిశా నిర్దేశం లేని రాజకీయాలతో జనసేన పార్టీని సామాజిక వర్గాన్ని పవన్
కళ్యాణ్ పతనం చేస్తున్నాడన్నారు. బిజెపితో పెళ్లి చేసుకుని తెలుగుదేశంతో
కాపురం చేస్తూ జనసేన పవన్ కళ్యాణ్ మూడుముక్కలాట ఆడుతున్నాడని ఉపముఖ్యమంత్రి
కొట్టు సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.