మెగా కోడలు ఉపాసన నెట్టింట్లో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తమ మీద జరిగే
ట్రోలింగ్లు, వచ్చే నెగెటివ్ కామెంట్ల మీద స్పందిస్తూ ఉంటుంది. నెటిజన్లకు తన
స్టైల్లో సమాధానాలు ఇస్తుంటుంది. తాజాగా ఓ జాతీయా మీడియా సంస్థతో మాట్లాడుతూ..
గతంలో ఎదురైన చేదు అనుభవాలు, పెళ్లి సమయంలో తన మీద జరిగిన ట్రోలింగ్‌ల గురించి
నోరు విప్పించింది. నాటి సంగతులు చెబుతూ ఇప్పుడు తాను ఎంత స్ట్రాంగ్‌గా
నిలబడిందో చెప్పుకొచ్చింది.
రామ్ చరణ్, తాను కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయ్యామని, ఆ పరిచయం కాస్తా
ప్రేమగా మారిందని, అది పెళ్లిగా మారిందని చెప్పుకొచ్చింది. తన పెళ్లి విషయంలో
తన ఆంటీ, తన సోదరి ప్రమేయం ఎక్కువగా ఉంటుందని, వారి వల్లే పెళ్లి వరకు
వచ్చిందని చెప్పుకొచ్చింది. తమ ఇరు కుటుంబాలు రెండు భిన్న నేపథ్యాలకు చెందినవి
ఉపాసన తెలిపింది.
చిన్నప్పటి నుంచి ఎవరో ఒకరు ఏదో ఒక విషయంలో తనను జడ్జ్ చేస్తూనే వచ్చారట.
సమాజంలోని ప్రతీ ఒక్కరూ ఇలాంటివి ఎదుర్కొంటూనే ఉంటాటరని ఉపాసన అనేసింది.
శరీరాకృతి, బ్యాక్ గ్రౌండ్ వంటి విషయాల్లో విమర్శలు వస్తూనే ఉండేవట. పెళ్లైన
కొత్తలో లావుగా ఉన్నానంటూ ట్రోలింగ్ చేశారట. ఇక రామ్ చరణ్ అయితే తనను డబ్బు
కోసమే పెళ్లి చేసుకున్నాడని అనేవారంటూ నాడు చేసిన, వచ్చిన విమర్శల మీద
స్పందించింది.
అలాంటి విమర్శల మీద తానెప్పుడూ స్పందించాలని అనుకోలేదట. ఎందుకంటే అలా మాట్లాడే
వారికి తన గురించి ఏమీ తెలియదని, ఇప్పుడు తన గురించి తెలిసిన వాళ్లు అలాంటి
కామెంట్లు చేయడం లేదని చెప్పుకొచ్చింది. ఇన్ని రకాల విమర్శలను తట్టుకుని,
ఎదుర్కొని నిలబడ్డానని, తాను ఒక చాంపియన్ అంటూ ఉపాసన తెలిపింది. ఆ విమర్శలను
ఎలా ఎదుర్కొన్నాననే విషయం తనకు మాత్రమే తెలుసని అనేసింది.