ఒక్క మహిళ చేత కూడా గృహప్రవేశం చేయించ లేని అసమర్థ ప్రభుత్వం వైసిపి
పశ్చిమ నియోజకవర్గంను సమస్యల నిలయంగా మార్చేశారు
సితార సెంటర్లో వందల కోట్ల విలువ చేస్తే స్థలాన్ని కొట్టేసి వైసిపి కార్యాలయం నిర్మించుకుంటున్న దొంగ పార్టీ వైసిపి పార్టీ
విజయవాడ : ఇంటింటికి రాబోయే మన జనసేన టిడిపి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 47 వ డివిజన్ లో డివిజన్ సమన్వయకర్తలు ఎరుపిల్లా కనకారావు, జిల్లెల్ల అనిల్,ఆకారపు విజయ్ కుమారి, రాళ్లపూడి గోవింద్, చిట్ల సతీష్, డివిజన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో చిట్టినగర్ శరత్ హాస్పిటల్ రోడ్ నుండి ఆరంభించి పలు ప్రాంతంలో పర్యటిస్తూ ప్రజలను కలుస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్న జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్
మీడియాతో మాట్లాడుతూ
ఈరోజు 47వ డివిజన్లో ఇంటింటికి రాబోయే మన జనసేన టిడిపి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరిగింది స్థానిక ప్రజలు మాకు మరణాంతరం ప్రమాద బీమా ఇవ్వడం లేదని అదేవిధంగా గంజాయి వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయి ఎక్కడ పడితే అక్కడ సందుల్లో గంజాయి సేవించి స్తానిక ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు అని వైసీపీ ప్రభుత్వం పశ్చిమ నియోజకవర్గంను సమస్యల నిలయంగా మార్చేసిందని సితార సెంటర్లో వందల కోట్ల విలువ చేస్తే స్థలాన్ని కొట్టేసి వైసిపి కార్యాలయం నిర్మించుకుంటున్న దొంగ పార్టీ వైసిపి పార్టీ అని పశ్చిమ నియోజకవర్గంలో పేద సామాన్య ప్రజలకి ఒక్క ఇల్లు కూడా ఇవ్వకుండా ఒక్క మహిళ చేత కూడా గృహప్రవేశం చేయించ లేని అసమర్థ ప్రభుత్వం వైసిపి ప్రభుత్వం అని జగన్ మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతీ మాట అబద్దమే అని జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ల పాలనలో ఒక్క పెట్టుబడి, కంపెనీలు గాని తీసుకొచ్చారా? జాబ్ కేలండర్ విడుదల చేశారా ? అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గాని, వైసీపీ నాయకులు గాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని అమరావతి ఉద్యమం ప్రారంభించి రేపటికి 1500 రోజులవుతుందని రాజధాని అమరావతి ఉద్యమాన్ని చంపడం అంటే ఈ రాష్ట్ర అభివృద్ధిని చంపడమే అని ఈ రోజున రాజధాని అమరావతిని అడ్డుకోవడం వల్లే ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయన మాట వాస్తవమని 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశామని జగన్మోహన్ రెడ్డి చెప్పారని, కానీ బటన్ నొక్కింది మాత్రం రెండు లక్షల 40 కోట్ల రూపాయలే అని మరి మిగిలిన డబ్బంతా ఏమైందని ఎవరు జేబుల్లోకి వెళ్లిందో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో అడుగడుగున అవినీతి కంపు కొడుతుందని ప్రతి వైసిపి నాయకుడు కూడా అవినీతి మీద దృష్టి పెట్టాడని పశ్చిమ నియోజకవర్గం లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి జరగడం లేదని ఈ ఐదు సంవత్సరాల్లో పశ్చిమ నియోజకవర్గం లో స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తో పాటు వైసిపి కార్పొరేటర్లు నాయకులు పశ్చిమ నియోజకవర్గంను దోచుకున్నారని ఇటువంటి వైసీపీ పార్టీకి పశ్చిమ నియోజకవర్గం ప్రజలు ఓటు వేయొద్దని గత ఐదు సంవత్సరాలుగా ప్రజల తరపున మేమే పోరాటాలు చేశామని అస్లాం మృతిని అది మర్డర్ అని చెప్పి ప్రజలకు వాస్తవాలు తెలియజేశామని, అత్తులూరి పెదబాబు కేబుల్ మాఫియా కి బలైపోయి నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్తే పార్టీలకు అతీతంగా మేము అతనికి అండగా నిలబడ్డామని, వైసిపి కార్యకర్త షేక్ చాంద్ భాష కూతురిపై ఆగాయిత్యం జరిగితే జనసేన పార్టీ తరఫున మేము అండగా నిలబడ్డామని జనసేన టిడిపి పార్టీల పొత్తు ప్రజా సంక్షేమం కోసమే పవన్ కళ్యాణ్ , చంద్రబాబు నాయుడు పెట్టుకున్నారని ప్రజలు గుర్తించారని ఈ విషయం జగన్ మోహన్ రెడ్డి కి తెలిసే ప్రజల దృష్టి మరలచడానికి ఇష్టానుసారం జనసేన టిడిపి మీద విమర్శలు చేస్తున్నారని అదేవిధంగా జగన్ మోహన్ రెడ్డి గారు ఈమధ్య ఎమ్మెల్యేల బదిలీ పథకం అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చారని ఈ నియోజకవర్గంలో మూడు సింహాల దొంగ, దేవాలయాల దొంగ పక్క నియోజకవర్గానికి మారిస్తే మంచోడు అవుతాడా ఈ నియోజవర్గంలో ఉన్న 420 నీ పక్కన నియోజవర్గంలోకి పంపించిన 420 నే అవుతాడని ప్రజలు ఎవరు కూడా అమాయకులు కాదని ఒక్క అవకాశం అని గెలిపిస్తే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని ఉద్దేశంతో ఉన్నారని రాబోయే ఎన్నికల్లో జనసేన టిడిపి పార్టీలను 150 పైగా సీట్లు గెలిపించి ఈ రాష్ట్రానికి బంగారు బాట వేయాలని ప్రజలందరూ కూడా చూస్తున్నారని, పశ్చిమ నియోజకవర్గంలో వైసిపి పార్టీ వారు కొండ ప్రాంతం అభివృద్ధి మేము అధికారంలో వచ్చాక జరిగిందని అదేవిధంగా పచ్చి ఇన్చార్జ్ ఎస్కే ఆసిఫ్ గారు రాబోయే ఎన్నికల్లో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి పశ్చిమ నియోజకవర్గం సీట్ ను గిఫ్ట్ గా ఇస్తామని అంటున్నారని దీనిపై మీ స్పందన ఏంటి అని అడగ్గా
పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది జరగలేదని కొండ ప్రాంతంలో రిటైనింగ్ వాల్స్ నిర్మాణము గాని మెట్లు గాని నిర్మించలేదని త్రాగునీరు లేక కొండప్రేంత వాసులందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, గంజాయి బ్యాచ్ ఆగడాలు ఎక్కువయ్యాయని కొండ ప్రాంత అభివృద్ధిపై చర్చకు మేము సిద్ధమని ఎక్కడికి రమ్మన్నా వస్తామని ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా అని అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గం కూడా జనసేన టిడిపి పార్టీ పక్షానికి మారిపోయారని రాబోయే ఎన్నికల్లో జనసేన టిడిపి పార్టీ తరఫున నేను పోటీ చేసి సాధించడం ఖాయమని పశ్చిమ నియోజకవర్గ వైసిపి పార్టీ వారు జగన్మోహన్ రెడ్డి గారికి కత్తి బ్లేడు గిఫ్ట్ గా ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు,వ్యాపార వాసు, విశ్వ, బంటుమిల్లి రాంబాబు, సతీషు, రమేషు, పిల్ల జనార్ధన్, రమణ, మల్లెపు విజయలక్ష్మి, అడ్డూరి తంబారావు పిల్ల వంశీ, పొట్నూరి శ్రీనివాసరావు, సోమి గోవింద్, కొరగంజి వెంకటరమణ, మోబీనా బోట్టా సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు