రజిని, మేయర్
విశాఖపట్నం : పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే జగనన్న లక్ష్యమని రాష్ట్ర
వైద్య శాఖ మంత్రి, విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి విడదల రజిని పేర్కొన్నారు.
శనివారం ఆమె 5వ జోన్ ఉత్తర నియోజకవర్గం పరిధిలో 48 వ వార్డు బాబూజీ నగర్ లో
సుమారు 1.07 కోట్ల రూపాయలతో నిర్మించిన డాక్టర్ వైయస్సార్ ప్రాథమిక ఆరోగ్య
కేంద్రాన్ని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ
మల్లికార్జున, ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు, వార్డ్ కార్పొరేటర్
గంకల కవితతో కలిసి శంకుస్థాపన చేశారు. నేషనల్ హెల్త్ మిషన్, జీవీఎంసీ నిధులతో
డాక్టర్ వైయస్సార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా
మంత్రివర్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇంటి వద్దకే వైద్యం అందే
విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రమిస్తున్నారని, అందులో భాగంగా సుమారు 1.10
లక్షల రూపాయలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు.
ప్రతి పేదవానికి కూడు గుడ్డ మంచి వైద్యం అందించడమే జగనన్న ప్రథమ కర్తవ్యం ఏమని
తెలిపారు. అనంతరం నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్
రెడ్డి సారధ్యంలో ప్రతి పేదవానికి మెరుగైన వైద్యం అందుతుందని నగర పరిధిలో
ప్రతి వార్డులో ప్రాథమిక ఆరోగ్య ప్రారంభించారని ఈ ఆస్పత్రిలో పేదలకు ఉచితంగా
కొన్ని వైద్య పరీక్షల తో పాటు మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఒక పేదవాడు
వైద్యం చేసుకోవాలంటే ఎంతో ఖర్చు అవుతుందని మన జగనన్న ప్రభుత్వంలో పైసా ఖర్చు
లేకుండా ఇంటి వద్దకే వైద్యం అందుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రతి
వార్డులో మౌలిక వసతులు కల్పన తో పాటు సంక్షేమము రెండు కళ్ళుగా భావించి
ముఖ్యమంత్రి అహోరాత్రులు కష్టపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ బాణాల
శ్రీనివాసరావు, కార్పొరేటర్లు అనిల్ కుమార్ రాజు, అల్లు శంకరరావు, సాడి పద్మా
రెడ్డి, వావిలిపల్లి ప్రసాద్, సారిపిల్లి గోవింద్, ఆళ్ల లీలావతి, ఉషాశ్రీ,
చల్లా రజిని, వార్డ్ ఇంచార్జ్ నీలి రవి, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు,
స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు.