హనుమకొండ: తెలంగాణలో ప్రభుత్వ దవాఖానలు పేదల పెన్నిధిగా మారాయని మంత్రి
ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత
ప్రభుత్వ హాస్పిటళ్లు పటిష్టమయ్యాయని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లోనే
నార్మల్ డెలివరీలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఆర్మూరు జిల్లా కోర్టులో
జూనియర్ జడ్జిగా సేవలు అందిస్తున్నరాచర్ల శాలిని.. హనుమకొండలోని ప్రభుత్వ
ప్రసూతి దవాఖానలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్
విప్ దాస్యం వినయ్ భాస్కర్‌తో కలిసి హాస్పిటల్‌కు వెళ్లిన మంత్రి.. శాలినిని
అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లా జడ్జిగా ఉండి ప్రభుత్వ దవాఖానలో
ప్రసవించడం ప్రజలకు ఒక మంచి సందేశాన్నిఅందించినట్లయిందన్నారు. వరంగల్
జిల్లాలోని ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులను రివ్యూ చేసినప్పుడు ప్రభుత్వ
దవఖానాల్లో నార్మల్ డెలివరీలు ఎక్కువగా జరుగుతున్నాయని తేలిందన్నారు. సర్కారు
దవాఖానల్లో 80 నుంచి 90 శాతం వరకు సాధారణ డెలివరీలు జరుగుతుండగా, ప్రైవేటు
హాస్పిటళ్లలో మాత్రం 60 నుంచి 70 శాతం ఆపరేషన్లు జరుగుతున్నట్లు నివేదిక ఉందని
చెప్పారు. భవిష్యత్తులో ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా సాధారణ ప్రసవాలు ఎక్కువగా
జరిగేటట్లు చూస్తామన్నారు. కేసీఆర్ కిట్ కింద ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన
వారికి రూ.12 వేలు చొప్పున అందిస్తున్నామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో
కూడా ఇలాంటి పథకం లేదన్నారు.