కడప : ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు సంతృప్త స్థాయిలో అందుతున్నాయని, ఇది
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పారదర్శక పాలనకు అద్దం పడుతోందని రాష్ట్ర
ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ అన్నారు. నగరంలోని రవీంద్ర నగర్ సచివాలయం-1
పరిధిలో 41 వ డివిజన్ డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం, ఇంచార్జి ఎస్. జమాల్
వల్లి ల ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి,
రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖామంత్రి అంజాద్ బాషా నిర్వహించారు. గడప గడపకు
మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి కి అభిమానులు, నగర
ప్రజానీకం, మహిళలు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి
ప్రభుత్వం పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏవిధంగా ప్రజలకు
చేరుతున్నాయని ఉపముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. స్థానిక కార్పొరేటర్,
నాయకులు, అధికారులతో కలిసి ఆయా వీధుల్లో నివాసాలన్నింటినీ తిరిగారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వారికి
వివరించి,వార్డు లోని అన్ని ఇళ్లకు తిరుగుతూ కుటుంబాలను కలుసుకోవడంతో పాటు,
వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంతకం
చేసిన బుక్ లెట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి కుటుంబం లబ్ది
చేకూరిందని ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేయగా పలువురు తమ సమస్యలను
అంజాద్ బాషా దృష్టికి తీసుకురాగా వెంటనే పరిష్కరించాలని సంబందిత అధికారులకు
ఆదేశించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయంగా
ముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా కుల,మత,
పార్టీలకతీతంగా అర్హత ఉన్న పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందించిన ఏకైక
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు
చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఏదో ఒక పథకం ద్వారా ప్రతి గడపకు లబ్ది
చేకూరిందని పలువురు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో
ఉపముఖ్యమంత్రి తోపాటు డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం , 41 వ డివిజన్ ఇంచార్జి
ఎస్. జమాల్ వల్లి,వై.కా.పా యువ నాయకులు ఉమైర్, కార్పొరేటర్లు షఫీ,రెడ్డి
ప్రసాద్,బలస్వామి రెడ్డి,అజమతుల్లా, రాం లక్ష్మణ్ రెడ్డి, నగర అధ్యక్షుడు
సుబ్బారెడ్డి,ఇతర వైసీపీ నాయకులు రామ్మోహన్ రెడ్డి,కృష్ణ, కార్పొరేషన్ ల
ఛైర్మన్ లు, డైరెక్టర్లు, ఇతర నగర కార్పొరేటర్లు సభ్యులు, సచివాలయం సిబ్బంది,
వాలంటీర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.