గుడివాడ : సొంతిల్లు ఉండాలన్నది ప్రతి ఒక్కరి కల. ఆ కలను సాకారం చేయాలని
సంకల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి టిడ్కో గృహాల నిర్మాణ
కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సరైన గృహ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న పేద
ప్రజలు గౌరవప్రదంగా జీవించే అవకాశం కల్పించారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని
ముఖ్యమంత్రి ఒక బాధ్యతగా తీసుకోవడంతో పేదల సొంతింటి కల నెరవేరింది. సొంతింటి
కల నిజమవుతున్నందులకు లబ్దిదారుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిస్తుంది. ఈ నెల 9వ
తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి గుడివాడలోని పిఎంఏవై వైయస్ఆర్ జగనన్న నగర్ ను
ప్రారంభించనున్నారు. గుడివాడ టిడ్కో ఇళ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి అమృత హస్తాలతో
లబ్దిదారులకు అందజేయనుండటం రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ
శుభదినంగా పరిగణించవచ్చు. గుడివాడ శాసన సభ్యులు కొడాలి వెంకటేశ్వరరావు (నాని)
ప్రత్యేక చొరవతో గుడివాడ మండలం మల్లాయపాలెంలో 77.46 ఎకరాలలో ఒకే చోట. 8,912
టిడ్కో గృహాలు నిర్మాణం పూర్తికావడం రాష్ట్రంలోనే అతిపెద్ద లే అవుట్
రూపుదిద్దుకోవడం చెప్పుకోదగ్గ విశేషం. అందులో తొలి విడతలో 3,296 గృహాలు,
నిర్మాణం కాగా రెండవ విడతలో 5,616 గృహాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది.
అందులో 300 చదరపు అడుగులవి. 365 చదరపు అడుగులవి, 430 చదరపు అడుగుల గృహాలు
ఉన్నాయి. టిడ్కో గృహాల నిర్మాణానికి 720.28 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు
చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 133.68 కోట్ల రూపాయలు కాగా, రాష్ట్ర
ప్రభుత్వం వాటా 289.94 కోట్ల రూపాయలు, లబ్దిదారుని ఋణంతో కలిపి మరో 296.66
కోట్ల రూపాయలు ఉన్నాయి. వాటా బ్యాంకు సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఇళ్ల
కేటాయింపులు చేయడంతో ఆ గృహాల లబ్దిదారులు ఎంతో సంతోషంగా గృహప్రవేశాలు
చేసేందుకు సిద్దంగా ఉన్నారు. కల నిజమవుతున్నందులకు లబ్దిదారుల ముఖాల్లో ఆనందం
వెల్లివిరిస్తోంది. ఈ నేపద్యంలో గుడివాడలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ టిడ్కో
గృహాల సముదాయానికి రాకపోకల కోసం అప్రోచ్ రోడ్లు, సిసిరోడ్డు, కల్వర్టులు, వరద
కాలువలు, భూతల జలాశయం, మంచినీటి సరఫరా పైపులైన్లు భూగర్భ డ్రైనేజి వ్యవస్థ,
విద్యుత్తు సౌకర్యం వంటి సదుపాయాలన్నీ ప్రభుత్వం కల్పించింది. రాష్ట్ర
ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయడం కోసం జిల్లా కలెక్టరు పి. రాజాబాబు
నేతృత్వంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పకడ్బందిగా చేస్తోంది.