సంక్షేమ పాలనను మరింత సమర్ధవంతంగా అమలు చేయటానికి సరిక్రొత్త ప్రణాళిక
పార్టీ పట్ల, ప్రజల పట్ల అంకిత భావం కలిగిన వారికి పార్టీలో ఎల్లప్పుడూ ప్రాధాన్యత
సచివాలయ కన్వీనర్ల నియామకంతో ప్రజలకు చేరువగా జగనన్న సంక్షేమ పాలన
తుది దశకు చేరుకున్న ఏలూరు నియోజకవర్గంలోని 79సచివాలయాల కన్వీనర్ల నియామక ప్రక్రియ
ఈ నెల 27,28వ తేదీల్లో ఏలూరులో వైఎస్సార్ సిపి కేంద్ర కార్యాలయంలో సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణా తరగతులు
వైఎస్సార్ సిపి జిల్లా పార్టీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించిన రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షులు ఆళ్ల నాని
ఏలూరు : ప్రతి పేదవాడి సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పాలనను మరింత సమర్ధవంతంగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నారని, వాటిలో భాగంగానే ఏలూరు నియోజక వర్గంలోని 79 సచివాలయాల పరిధిలో ప్రతి సచివాలయానికి 3కన్వీనర్లను నియమించడం జరుగుతుందని రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షులు ఆళ్ల నాని అన్నారు. ఏలూరు నియోజవర్గం పరిధిలో సచివాలయ కన్వీనర్లు నియామకంతో పాటు ఈ నెల 27,28 తేదీల్లో ఏలూరులో జరగనున్న ప్రత్యేక శిక్షణా తరగతుల నిర్వహణపై శనివారం మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షులు ఆళ్ల నాని ఏలూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలుపెరుగని కృషి చేస్తున్నారని, అర్హులైన ప్రతి ఒక్కరికి నవరత్నాల వంటి సంక్షేమ పథకాలు మరింత చేరువ చేస్తూ ప్రతి పేద కుటుంబానికి అండగా నిలబడాలనే ఉద్దేశ్యంతోనే సచివాలయ కన్వీనర్లు నియామకం చేపట్టారని ఆళ్ల నాని అన్నారు. సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు నియామకం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పాలన ప్రజలకు మరింత చేరువ కానున్నదని ఆళ్ల నాని తెలిపారు. ఈసందర్భంగా ఏలూరు నియోజకవర్గంలోని పలువురు ప్రజా ప్రతినిధులు, ఆయా కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నాయకులతో చర్చించి చేపట్టిన 79 సచివాలయాల కన్వీనర్ల నియామక ప్రక్రియ తుది దశకు చేరినట్లు, ఎంపిక చేసిన పేర్లతో కూడిన లిస్ట్ ను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించనునట్లు ఆళ్ల నాని తెలిపారు.
ఈ సమావేశంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి, నగర డిప్యూటీ మేయర్లు గుడిదేసి శ్రీనివాస్, నూకపెయ్యి సుధీర్ బాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్ నెరుసు చిరంజీవులు, వైఎస్సార్ సిపి సీనియర్ నాయకులు బలరాం, కో-అప్షన్ సభ్యులు పెదబాబు, మున్నుల జాన్ గురునాధ్, కార్పొరేటర్లు పిల్లంగోళ్ల శ్రీ దేవి, తుమరాడా స్రవంతి, జిజ్జువరపు విజయ నిర్మల, యర్రంశెట్టి సుమన్,పొలిమేర దాసు, జయకర్, బత్తిన విజయ్ కుమార్,సుంకర చంద్రశేఖర్, తంగేళ్ల రాము,సబ్బన శ్రీనివాస్, యర్రంశెట్టి నాగబాబు, అద్దంకి హరిబాబు, కడవకోల్లు సాంబా, గునిపూడి శ్రీనివాస్ సహా పలువురు కార్పొరేటర్లు, వైఎస్సార్ సిపి నాయకులు బండారు కిరణ్, దారపు తేజా, నున్న కిషోర్ సహా పలువురు వైఎస్సార్ సిపి నాయకులు , అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.