కడప : అనునిత్యం పేద బడుగు బలహీన వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు
కృషిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని రాష్ట్ర ఉప
ముఖ్యమంత్రి ఎస్. బి. అంజాద్ బాషా అన్నారు. ఆదివారం ఉపముఖ్యమంత్రి, మైనార్టీ
సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి. అంజాద్ భాష నివాస కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్
క్రింద నలుగురు లబ్దిదారులకు రూ.18 లక్షల, 28 వేలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి అంజాద్ భాష
మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు
స్వీకరించినప్పటి నుండి ఆరోగ్యశ్రీని తన తండ్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి
ఆరోగ్య శ్రీ పథకాన్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ప్రవేశపెట్టి
లక్షలాది మందికి ప్రాణదాతగా మారడం జరిగిందని అన్నారు. దేశానికే ఆయన ఆదర్శంగా
నిలవడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అమలు అయిన తర్వాత
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే నేమి, మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ని ఆదర్శంగా తీసుకొని
దేశంలోని వివిధ రాష్ట్రాలలో కూడా ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేయడం జరిగిందని
చెప్పారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆయుష్మాన్ భవ పథకాన్ని ప్రవేశపెట్టి దేశ
వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. వైయస్
రాజశేఖర్ రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి ప్రవేశపెట్టిన ఆరోగ్య
శ్రీ పథకాన్ని ఇంకా మెరుగులు దిద్దుతూ, గత ప్రభుత్వాలు నీరు గారిస్తే
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే రూ.1000లు దాటితే అన్ని రోగాలను
ఆరోగ్యశ్రీ పథకంలోకి తీసుకొనిరావడం జరిగిందని అన్నారు. మొన్నటికి మొన్న 2350
వ్యాధులకు సంబంధించి ఆరోగ్యశ్రీ పథకంలో ఉంటే మరో 1000 రకాల వ్యాధులను కలిపి,
నవంబర్ 1 వ తేదీ నుండి సుమారుగా 3000 పైచిలుకుగా వ్యాధులను ఆరోగ్యశ్రీలో
చేర్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేనని అన్నారు. ఆరోగ్యశ్రీ
ద్వారా ఆపరేషన్ చేయించుకున్న రోగి తాను కొలుకున్నంత వరకు రెస్టులో ఉన్న సమయంలో
డాక్టరు సలహా మేరకు చికిత్సను బట్టి ప్రతి నెలా ఆరోగ్యశ్రీ ఆసరా సాయాన్ని కూడా
అందించడం దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రస్తుతం మన రాష్ట్రంలో అమలవ్వడం గొప్ప
విషయం అన్నారు. ప్రతి ఆసుపత్రికి కూడా గడిచిన నెలలో ఆరోగ్య శ్రీ పథకం కింద
ఎన్ని చికిత్సలు, ఆపరేషన్లు చేశారో షరా మామూలుగానే ఆస్పత్రులకు గ్రీన్ ఛానల్
పెట్టి మొదటి ప్రాధాన్యతగా బిల్లులు చెల్లించడం జరుగుతోందని, అది జగన్ మోహన్
రెడ్డి ప్రభుత్వమేనని తెలిపారు.
ఆరోగ్యశ్రీ పథకంలో మెరుగైన వైద్యం అందిస్తూ, ఆరోగ్యశ్రీ పథకంలో కవర్ కానీ
రోగాలకు, అలాంటి వైద్య చికిత్సలకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద ఆర్థిక
సహాయాన్ని అందించడం జరుగుతోందని అన్నారు. అందులో భాగంగా నలుగురు లబ్ధిదారులకు
సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద రూ.18 లక్షల, 28 వేలు చెక్కులను పంపిణీ చేయడం
జరిగిందని చెప్పారు. గతంలో ఎన్నడు లేని విధంగా మొన్నటికి మొన్న 12 సంవత్సరాల
బాలిక చాలా పేదరాలని వారి ఊహలకు కూడా అందని పరిస్థితి అని ఆ అమ్మాయి కి లివర్
ట్రాన్స్పోర్ట్ రేషన్ ఆపరేషన్ కు సంబంధించి రూ.28 లక్షల ఖర్చు అవుతుందని,
పూర్తిగా చికిత్సకు సీఎం రిలీఫ ఫండ్ క్రింద ఆర్థిక సహాయమందించి, ఆసుపత్రిలో
మంచి మెరుగైన వైద్యం అందించడం జరిగిందని అలాగే అమ్మాయి పరిస్థితి వైద్యంతో
ఎంతో మెరుగుపడిందని ఆసుపత్రి యాజమాన్యాలు తమకు సమాచారం తెలుపడం జరిగిందని
చెప్పారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పలేనంత సంతోషం పడ్డారని, సంతోషానికి
హద్దులు లేవని అన్నారు. గతంలో క్యాన్సర్ వ్యాధి చికిత్స కు రూ. 2 లక్షలకు
పరిమితి ఉండేదని ప్రస్తుతం హద్దు లేకుండా ఉచితంగా చికిత్స పూర్తి అయ్యేంతవరకు
ఉందని అన్నారు.
అలాగే ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అన్ని మౌలిక
సదుపాయాలు కల్పిస్తూ, ఆధునికరణ చేయడం జరిగిందని, డాక్టర్ల కొరత లేకుండా
డాక్టర్లను నియమించడం జరిగిందని చెప్పారు. ప్రజలు ఇవన్నీ గమనించి మన మనసున్న
ముఖ్యమంత్రిని ఆశీర్వదించాలన్నారు. తొలుత కడప నగరానికి చెందిన నలుగురు
లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.18 లక్షల, 28 వేల చెక్కులను రాష్ట్ర ఉప
ముఖ్యమంత్రి ఎస్ బి అంజాద్ భాష చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఇందుకు లబ్ధి
పొందిన లబ్ధిదారులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కలకాలం ఆయనే ముఖ్యమంత్రిగా
ఉండాలని, అలాగే ఉపముఖ్యమంత్రి ఎస్ బి అంజాద్ భాష కూడా భవిష్యత్తులో ఉప
ముఖ్యమంత్రిగా పదవులను పొంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవలందించాలని ఆ
దేవున్ని ప్రార్థిస్తున్నామని చెప్పారు.