పోషకాలు సైతం దండిగానే ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.
విటమిన్ సి:
ఒక కప్పు పైనాపిల్ ముక్కలు తీసుకుంటే మనకు రోజు మొత్తంలో అవసరమైన విటమిన్ సి
లభించినట్టే. దీంతో రోగనిరోధకశక్తి బాగా పుంజుకుంటుంది. కణజాలం వృద్ధి
చెందటానికి, కణాలు మరమ్మతులోనూ విటమిన్ సి పాలు పంచుకుంటుందన్న సంగతి
తెలిసిందే. పైగా దీనిలోని యాంటీఆక్సిడెంట్లు కణాలకు త్వరగా వృద్ధాప్యం
ముంచుకురాకుండా చేస్తాయి.
బరువు తగ్గటానికీ: క్యాన్సర్, గుండెజబ్బు వంటి జబ్బులు దరిజేరకుండానూ
చూస్తాయి. వ్యాయామ చేసేవారిలో విటమిన్ సి స్థాయులు తగ్గితే కేలరీలు తక్కువగా
ఖర్చవుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అంటే పైనాపిల్ బరువు తగ్గటానికీ
తోడ్పడుతుందన్నమాట.
జీర్ణక్రియ మెరుగు:
పైనాపిల్ తో కడుపుబ్బరం, అజీర్ణం వంటి సమస్యలూ దూరమవుతాయి. దీనిలోని
బ్రొమెలనిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్లు బాగా జీర్ణం కావటానికి తోడ్పడుతుంది. ఇక
దీనిలోని పీచు కడుపు నిండిన భావనను కలిగించి, ఎక్కువగా తినకుండానూ చూస్తుంది.
అలాగే మలబద్దకం దరిజేరకుండా కాపాడుతుంది.
చర్మానికి:
పైనాపిల్ లో మ్యాంగనీసు ఖనిజం కూడా దండిగా ఉంటుంది. ఒక కప్పు పైనాపిల్
ముక్కలతో మన శరీరానికి రోజుకు అవసరమైనంత మ్యాంగనీసు లభిస్తుంది. ఇది విటమిన్
సితో కలిసి చర్మం నిగనిగలాడేలా చేస్తుంది. సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాల
నుంచి చర్మ కణాలు దెబ్బతినకుండానూ. కాపాడుతుంది.