విజయవాడ : రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలోని ఆప్కో చేనేత వస్త్ర విక్రయశాలలలో
మేనేజర్లు, అమ్మకాల సహాయకులుగా పని చేయుటకు అర్హత కలిగిన వారిని నేరుగా
ఇంటర్వ్యూ ఆహ్వానిస్తున్నట్లు సంస్థ విసి, ఎండి తెలిపారు. విక్రయ రంగంలో
ఆసక్తి కలిగి ఇంటర్ లేదా డిగ్రీ ఉత్తీర్ణతతో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్
కలవారు ఈ ఉద్యోగాలకు అర్హులని వివరించారు. అభ్యర్థులు పూర్తి వివరాలు కలిగిన
బయోడేటాతో జూలై మూడవ తేదీ ఉదయం 11 గంటలకు విజయవాడ, గవర్నర్ పేట, రహమాన్
పార్క్ దగ్గరలోని ఆప్కో కేంద్ర కార్యాలయం నందు ఇంటర్వ్యూకు హాజరు కావాలని
వివరించారు. ఎంపికైన వారికి కనిష్టంగా రూ. 9వేలకు పైబడి, వారి పనితీరు ఆధారంగా
వేతనం నిర్ణయించబడుతుందని ఎండి తెలిపారు. ఆప్కో సంస్థ, విక్రయశాలల వివరాలు
గురించిన పూర్తి సమాచారం www.apcohandlooms.com వెబ్ సైట్ నుండి
తెలుసుకోవచ్చన్నారు.