డాక్టర్ తానేటి వనిత.
కొవ్వూరు : తాళ్లపూడి మండలం పోచవరం గ్రామంలోని శ్రీ కోదండ రామస్వామి వారి
దేవాలయం నూతన విగ్రహా ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం సోమవారం కనులపండువగా
జరిగింది. ఆలయంలో స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభం ప్రతిష్ట
నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ
శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు
చేశారు. స్వామివారికి మంత్రి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ దేవుని చల్లని
చూపు ప్రజలందరి పై ఉండాలని మంత్రి ఆకాక్షించారు. ఆలయ కమిటీ సభ్యులు హోం
మంత్రిని శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. పసుపు-కుంకుమ, పట్టు
వస్త్రాలతో ఆమె సత్కరించారు. అనంతరం గ్రామ పెద్దలు, నాయకులతో గ్రామాభివృద్ధి
అంశాలపై కాసేపు చర్చించారు. రామచంద్ర స్వామి వారి అన్న ప్రసాదాన్ని హోం మంత్రి
స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, నియోజక
వర్గ ప్రజలు పాల్గొన్నారు.