యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శక త్వంలో రూపొందిస్తున్న
తాజా చిత్రం ‘దేవర’ జాన్వీకపూర్ ఈ చిత్రం లో కథానాయికగా నటిస్తున్నది.
బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్అలీఖాన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ
సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది. తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్ లో ఏర్పాటు
చేసిన భారీ సెట్లో పోరాట ఘట్టాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్-
సైఫ్అలీఖాన్ మధ్య వచ్చే ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాలో హైలైట్ గా నిలుస్తుందని
చెబుతున్నారు. ఎన్టీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్
పోస్టర్ ఈ సినిమాపై మరింత అంచనాల్ని పెంచింది. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంత
నేపథ్య కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మృగాల్లాంటి మనుషుల భారి
నుంచి తన వారిని రక్షించుకునే ధీరోదాత్తుడైన వ్యక్తిగా ఎన్టీఆర్ పాత్ర అత్యంత
శక్తివంతంగా సాగుతుందని సమాచారం. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై
సుధాకర్ మిక్కిలినేని, కొవరాజు హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే
ఏడాది ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.