అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అరెస్ట్ చేస్తారన్న వార్తలు
ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే పోర్న్ స్టార్‌కు
అమెరికా మాజీ అధ్యక్షుడికి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసిన కారణాలపై
ఆసక్తి నెలకొంది. అస్సలు వీళ్లిద్దరికి ఎక్కడ పరిచయమైంది.. అది అనైతిక
సంబంధానికి ఎలా దారి తీసింది.. చివరికి ఈ సంబంధం.. ట్రంప్ మెడకు ఎలా
చిక్కుకుందన్న విషయాలు ఆసక్తికరంగా మారాయి. అయితే ట్రంప్‌తో తనకున్న సంబంధంపై
డానియల్ ప్రతీ సంఘటనను అక్షరబద్ధం చేశారు. ఆమె రాసిన ఫుల్ డిస్క్లోజర్
పుస్తకంలో అన్ని విషయాలను సమగ్రంగా వివరించారు.