పరామర్శించిన ఎంపీ భరత్
రాజమండ్రి : పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మంగళవారం ఉదయం గుండెపోటు రావడంతో
తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను వెంటనే రాజమండ్రి సాయి హాస్పిటల్ కు
తీసుకువచ్చారు. అక్కడ వైద్యులు ఎమ్మెల్యే బాలరాజును పరీక్షించి, గుండెలో
స్టంట్ అమర్చినట్టు సాయి ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం సాయి ఆసుపత్రి
వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలో ఉన్నారు. ఎమ్మెల్యే బాలరాజు కోలుకొంటున్నట్టు
తెలిసింది. కాగా సమాచారం అందగానే వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్,
రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ సాయి హాస్పిటల్ కు వెళ్ళి ఎమ్మెల్యే
బాలరాజు ను పరామర్శించారు. అలాగే కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. సాయి
ఆసుపత్రి వైద్యులతో ఎంపీ భరత్ మాట్లాడి ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆరోగ్య
పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎంపీ భరత్ తో నగర పార్టీ అధ్యక్షుడు అడపా
శ్రీహరి, పోలు విజయలక్ష్మి, గుర్రం గౌతమ్ తదితరులు ఉన్నారు.