వైసిపి రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ డిమాండ్
విజయవాడ : పోలవరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా అవినీతిపై సిబిఐ విచారణ చేయాలని వైసిపి రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం భవానిపురం లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.గత తెలుగుదేశం పరిపాలనలో పోలవరం , పట్టిసీమ లాంటి ప్రాజెక్టులలో జరిగిన పనుల్లో కోట్ల రూపాయలు చంద్రబాబు కుటుంబ సభ్యులు దోచుకున్నారని ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ అధినేత, తెలుగుదేశం నాయకులు రాయపాటి రంగారావు చేసిన వ్యాఖ్యల ఆధారంగా సిబిఐ ఎంక్వైరీ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పోలవరం సోమవారం పేరుతో ప్రజలను మభ్యపరిచి కోట్ల రూపాయలను దండుకున్న చంద్రబాబు, దేవినేని ఉమా తదితరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తెలుగుదేశం చంద్రబాబు పాలనలో పోలవరం ప్రాజెక్టును ఏటీఎంల వాడుకుంటున్నారని స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారన్నారు. ఇలాంటి అవినీతి పరుడైన చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. తెలుగుదేశం మునిగే పడవ వంటిదని గ్రహించే విజయవాడ ఎంపీ కేశీ నేని నాని, ట్రాన్స ట్రాయ్ అధినేత రంగారావు తెలుగుదేశం పార్టీ నుండి బయటకు వచ్చేసారని చెప్పారు. విజయవాడ అభివృద్ధికి కృషి చేసిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పారు. చంద్రబాబు ,లోకేష్ తదితరుల అవినీతిలో నిండా కూరుకుపోయిన తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించాలని ప్రజలకు ఆకుల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా, ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జగనన్న పాలన తోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. సమావేశంలో వైసిపి నాయకులు పొదిలి చంటిబాబు, ఏలూరు వెంకన్న, ఎం.వెంగళరెడ్డి, దూబ తిరుపతి నాయుడు పాల్గొన్నారు.