బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
మండలంలోని నిడిగల్లు, పిల్లలు, గొల్లపల్లి, కొత్త పాళెం,అలిమిలి,మన్నూరు,పల్లి గ్రామాలలో ఉన్న పోలింగ్ కేంద్రాలను స్థానిక తహసీల్దార్ పుల్లారావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ మండలంలో ఉన్న 75 పోలింగ్ కేంద్రాలు ఉండయన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో అన్ని వస్తువులు ఉండేలా ప్రత్యేకమైన చర్యలు చేపడం జరుగుతుందన్నారు. కాకుండా పోలింగ్ కేంద్రం గ్రామానికి ఎంత దూరం ఉన్నదో దాని వివరాలు కూడా సేకరించడం జరుగు తుందని చెప్పారు. అంతేకాకుండా పోలింగ్ కేం ద్రాల్లో పోలీసులు నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. ఆయన వెంట వి అ ర్ ఓ శ్రీనివాసులు రెడ్డి తదితరులు ఉన్నారు.
ఫోటో:- పోలింగ్ కేంద్రాల పరిశీలిస్తున్న తహసీల్దారు