మంగళగిరి : రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం డైరీ-2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. విజయవాడ పోలీస్ ప్రధాన కార్యాలయం లో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జె.శ్రీనివాస రావు, ప్రధాన కార్యదర్శి ఎండీ మస్తాన్ ఖాన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సోమయ్య పలు జిల్లా యూనిట్ల పోలీసు సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు