విజయవాడ : విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల
దేవస్థానంలో విజయవాడ నగర పోలిసు శాఖ తరపున విజయవాడ నగర పోలీస్ కమీషనరు
క్రాంతి రాణా టాటా కనకదుర్గా అమ్మవారికి పవిత్ర సారె సమర్పించారు. ఆలయమునకు
విచ్చేసిన నగర పోలీస్ కమీషనరు క్రాంతి రాణా టాటా కు ఆలయ ట్రస్ట్ బోర్డు
చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి దర్భముళ్ళ భ్రమరాంబ, ట్రస్ట్
బోర్డు సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కమిషనర్
అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారికి I టౌన్ పోలీసు శాఖ వారి తరపున పవిత్ర
సారె సమర్పించారు. అనంతరం ఆలయ ప్రధానార్చకులు వీరికి వేదాశీర్వచనం చేయగా ఆలయ
చైర్మన్, కార్యనిర్వహణాధికారి అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం అందజేసినారు.
ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ తో పాటు డి.సి.పి.లు విశాల్ గున్ని,
ఉదయరాణి ,అడిషినల్ డి.సి.పి.లు, ఏ.సి.పి.లు, ఇనస్పెక్టర్లు, సిబ్బంది
పాల్గొన్నారు.