మునుగోడు : వృద్ధులు, దివ్యాంగులకు ఎన్నికల సంఘం కల్పించిన పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నట్టు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో ఈ ఓట్లను దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నట్టు సమాచారం. వృద్ధులు, దివ్యాంగులకు ఎన్నికల సంఘం కల్పించిన పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నట్టు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో ఈ ఓట్లను దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నట్టు సమాచారం. సంస్థాన్ నారాయణపురం మండలంలో 128 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండగా బుధవారం వరకు 88 నమోదయ్యాయి. కొన్ని ఓట్లను ఓ ప్రధాన పార్టీ రూ.2 వేలు – రూ.3 వేలకు, మరో పార్టీ రూ.5 వేలతో కొన్నట్లు ప్రచారం జరిగింది. ఎన్నికకు సమయం సమీపిస్తున్నకొద్దీ ఈ మొత్తం పెరుగుతున్నట్టు సమాచారం. గురువారం రెండు ప్రధాన పార్టీలూ కొందరికి ఓటుకు రూ.5 వేల చొప్పున రూ.పదేసి వేలు ముట్టజెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. గురువారం ఇక్కడ మరో 36 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి.