ఒంగోలు : ప్రకాశం జిల్లా దర్శి లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బస్సు
అదుపుతప్పి సాగర్ బ్రాంచి కాలువలో పడడంతో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి
చెందారు. మృతుల్లో ఆరుగురు మహిళలుతో పాటు ఒక వృద్ధుడు ఉన్నారు. వీరంతా పొదిలి
నుండి కాకినాడకు ఓ ఫంక్షన్ కు వెళ్తున్నట్లు తెలిపారు. కాకినాడ ఫంక్షన్ కు
ఒంగోలు డిపోకు చెందిన ఆర్టీసీ బస్ లో వీరంతా ప్రయాణిస్తున్నారు.చనిపోయిన
వారిలో ఓ మైనర్ బాలిక కూడా ఉంది… బస్సులో మొత్తం 37 మంది ప్రయాణికులు
ఉన్నారు. చనిపోయిన ఏడుగురు వ్యక్తులు మినహా మిగిలిన 30 మంది ప్రయాణికులు గాయాల
పాలయ్యారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.గాయపడ్డ వారిని 108 వాహనాల్లో
దర్శి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ప్రయాణం జరిగిన అరగంట సమయంలోనే ఈ
ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీను తప్పించపోయి సాగర్ కాలువలో బస్సు
పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు క్షతగాత్రులు తెలిపారు…బస్ డ్రైవర్
పరిస్థితి విషమంగా ఉండడంతో ఒంగోలుకు తరలించారు.
చనిపోయిన వారి వివరాలు
1. అబ్దుల్ ఫ్లాజిజ్ (65 సం)
2. అబ్దుల్ హనీ (60 సం)
3. షేక్ రమీజ్ (48 సం)
4. ముళ్ళ నూర్జహాన్ (58 సం)
5. ముళ్ళ జానీ బేగం (65సం)
6. షేక్ సబీనా (35 సం)
7. షేక్ హీనా (6 సం)