ప్రకృతి సేద్యం విస్తరణ-ప్రకృతి సేద్య విశ్వవిద్యాలయం ఏర్పాటు దిశగా చర్యలు *
2025-26 నాటికి 60 శాతం రాష్ట్ర విస్తీర్ణంలో ప్రకృతి సేద్యం సాగుకు చర్యలు *
పియం ప్రాణం పధకం ద్వారా పెద్దఎత్తున పరిహారం పొందేలా కార్యాచరణ ప్రణాళిక *
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి
అమరావతి : రాష్ట్రంలో రానున్న రోజుల్లో ప్రకృతి సేద్య విధానాన్ని పెద్దఎత్తున
ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.శుక్రవారం వెలగపూడి రాష్ట్ర
సచివాలయంలో ప్రకృతి సేద్యం విస్తరణ,నిధుల సమీరణ,ప్రకృతి సేద్యానికి సంబంధించి
ప్రత్యేకంగా విశ్వ విద్యాలయం ఏర్పాటు అంశాలపై ఆయన అధికారులతో
సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రకృతి సేద్యాన్ని
రైతులందరూ ఆచరించే విధంగా వారిలో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం
ఉందని ఆదిశగా మరిన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.గత ఏడేళ్ళుగా
రాష్ట్రంలో ప్రకృతి సేద్యం సాగులో సాధించిన విజయాలను కలిగిన లాభాలపై రైతుల్లో
తగిన అవగాహన కలిగించి రైతులందరూ ఈవిధానం కింద సాగు చేసేలా అన్ని విధాలా
ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. నాచురల్ ఫార్మింగ్ చేస్తున్న
ప్రాంతాన్ని అంతటినీ ఇ-క్రాఫింగ్ చేసి ఇంట్రిగ్రేట్ చేయాలని చెప్పారు.అంతేగాక
నాచురల్ ఫార్మింగ్ మరియు నాచురల్ ఫార్మింగేతర విధానంతో ఇంటిగ్రేట్ చేయాలని
చెప్పారు. రైతులు ప్రకృతి సేద్యం విధానాన్ని పాటిస్తూ ఎరువులు,పురుగుమందులు
వినియోగం తగ్గిస్తే ప్రధానమంత్రి ప్రాణం పధకం కింద పెద్దఎత్తున సబ్సిడీని
పొందవచ్చని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి చెప్పారు.మదర్ ఎర్త్
యొక్క పునరుద్ధరణ,అవగాహన,జనరేషన్, పోషణ,మెరుగుదలకై కేంద్ర ప్రభుత్వం ఈపియం
ప్రాణం పధకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు.రసాయనేతర ఎరువులను
ప్రోత్సహించడానికి మరియు వాటిపై ఆధారపడటాన్ని తగ్గించడాన్ని ప్రోత్సహించేందుకు
ఈపధకం దోహదపడుతునందన్నారు.పియం ప్రాణం పధకంలో పాల్గొనే రాష్ట్రాలు రసాయన
ఎరువుల వాడకాన్ని తగ్గించినందుకు పరిహారంగా రాయితీలను పొందుతాయని ఆవిధంగా
రాష్ట్రానికి పెద్దఎత్తున ఈపియం ప్రాణం రాయితీలు పొందేందుకు అవకాశం ఉంటుందని
పేర్కొన్నారు.ఈవిధంగా వచ్చే రాయితీలు,నాబార్డు, బ్యాంకులు,వివిధ ధాతల సహకారంతో
రాష్ట్రంలో ప్రకృతి సేద్యానికి సంబంధించి ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని
ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేయడం జరుగుతుందని సిఎస్.జవహర్ రెడ్డి
తెలిపారు. ఈసమావేశంలో రాష్ట్ర రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్
టి.విజయకుమార్ రాష్ట్రంలో ప్రకృతి సేద్యం దాని విస్తరణ తదితర అంశాలపై పవర్
పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ రాష్ట్రంలో 2025-26 నాటికి అన్ని గ్రామాల్లో
ప్రకృతి సేద్యం సాగు విస్తరణను ప్రోత్సహించేందుకు తగిన చర్యలు
తీసుకుంటున్నట్టు తెలిపారు.ఈవిధానంలో సాగు చేయడం వల్ల రైతులు ఎరువులు,పురుగు
మందులు పూర్తిగా తగ్గించడంతో పియం ప్రాణం పధకంలో పెద్దఎత్తున రాయితీ కింద
నిధులు పొందేందుకు అవకాశం ఉంటుందని ఆనిధులతో ప్రకృతి సేద్యాన్ని రాష్ట్ర మంతటా
అన్ని గ్రామాల్లో విస్తరణకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం
రాష్ట్రంలో కమ్యునిటీ మేనేజ్డ్ నాచురల్ ఫార్మింగ్ కింద ఇప్పటి వరకూ 3730
గ్రామాల్లో 8లక్షల 50 వేల మంది నమోదై 3లక్షల 77 వేల హెక్టార్లలో ప్రకృతి
సేద్యం ద్వారా సాగు చేస్తున్నారని తెలిపారు.ప్రకృతి సేద్యం వల్ల భూసార
పరిరక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణ,నీటి వినియోగం తగ్గించడంతో పాటు వాయు
కాలుష్యాన్ని తగ్గించేందుకు అవకాశం కలుగుతోందని చెప్పారు.గత ఏడేళ్ళుగా
రాష్ట్రంలో కమ్యునిటీ మేనేజ్డ్ నాచురల్ ఫార్మింగ్ తో ఘణనీయమైన ఫలితాలను
సాధించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఈసమావేశంలో ప్రకృతి సేద్యానికి
సంబంధించి వివిధ అంశాలపై సిఎస్ సమీక్షించారు.ఈసమావేశంలో రాష్ట్ర
వ్యవసాయ,పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాల కృష్ణ
ద్వివేది,రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన
కార్యదర్శి బి.రాజశేఖర్,రైతు సాధికార సంస్థ సిఇఓ బి.రామారావు పాల్గొనగా వీడియో
లింక్ ద్వారా ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్,సెర్ప్ సిఇఓ ఇంతియాజ్
పాల్గొన్నారు.