సమర్ధతకు సంకేతం సీఎం వైఎస్ జగన్ * జేసీఎస్ శిబిరంలో మాజీ డిప్యూటీ సీఎం
ధర్మాన కృష్ణదాస్
నరసన్నపేట : సీఎం వైస్ జగన్ పాలనలో జరిగిన ప్రగతిని, సంక్షేమాన్ని ప్రజల్లోకి
తీసుకువెళ్లాలని, రాష్ట్రానికి జగన్ ఎందుకు అవసరమనే విషయాన్ని వివరించాలని
మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్
పిలుపునిచ్చారు. సోమవారం నరసన్నపేటలో జగనన్న సచివాలయాల కో ఆర్డినేటర్ల నమోదు
శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న
వయసులోనే సమర్థుడైన ముఖ్యమంత్రిగా సీఎం వైఎస్ జగన్ అన్ని వర్గాల ప్రజల
ప్రసంశలు అందుకుంటున్నారని అన్నారు. ఈ రాష్ట్రానికి సీఎం జగన్ అవసరం ఏమిటో
స్పష్టంగా చెప్పాలనీ, మేనిఫెస్టోని దైవంగా భావించి 98శాతం హామీలను అమలుచేసి
జగన్ తన మాటని నిలుపుకొన్నారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2019 వరకూ టీడీపీ
రాష్ట్రం మీద 41 లక్షల కోట్ల రూపాయల రుణభారాన్ని మోపిందన్నారు. అయినప్పటికీ
కోవిడ్ లాంటి కష్ట పరిస్థితుల్లోనూ మన నాయకుడు రాష్ట్రాన్ని దేశంలో
అగ్రస్థానంలో నిలిపారన్నారు. జగన్ చెప్పారంతే చేస్తారనే భరోసా ఇచ్చారని
పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి చలించి నవరత్నాలనే సంచలనాత్మక సంక్షేమ పథకాలను,
గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో ప్రజలందరికీ సమర్ధవంతమైన
పాలన అందిస్తున్నదని తెలిపారు. చివరి వ్యక్తి వరకూ సేవలు సక్రమంగా
చేరుతున్నాయని, జగన్ అధికారంలోకి వచ్చిన 2019 నుంచీ రాష్ట్రంలో ఎన్నో మార్పులు
వచ్చాయనీ, అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థకి రూపకల్పన చేశారన్నారు.
ఈస్ డూయింగ్ ఆఫ్ బిజినెస్ లో రాష్ట్రాన్ని నంబర్ 1 గా నిలిపారన్నారు. కోవిడ్
ప్రభావంలోనూ రుణాలను మూడు రెట్లు తగ్గించారనీ రికార్డు స్థాయిలో పెట్టుబడులు
వచ్చాయన్నారు. వైజాగ్ సమ్మిట్ ద్వారా రూ.13.5 లక్షల కోట్ల పెట్టుబడులు
వచ్చాయనీ ఆరు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారని కృష్ణ దాస్ పేర్కొన్నారు.
విశిష్ట అతిథిగా హాజరైన జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ మాట్లాడుతూ సీఎం జగన్
ప్రభుత్వ పాఠశాలలకు సరికొత్త రూపునిచ్చారని చెప్పారు. 17 వైద్య కళాశాలలు,
ఆరోగ్యశ్రీ ద్వారా అరోగ్య రంగంలో సదుపాయలను పెంచారన్నారు. రాజకీయాల్లో 50శాతం
అవకాశాన్నిచ్చి మహిళా సాధికారతని పెంచారన్నారు. నాలుగేళ్లలో 11,500 కిలోమీటర్ల
పొడవైన అత్యుత్తమ రహదారుల్ని నిర్మాణం చేశారనీ, వ్యవసాయరంగంలో సంక్షేమం వల్ల
వ్యవసాయ ఉత్పాదకత పెరిగిందని తెలిపారు. అభివృద్ధిలో భాగంగా ప్రతి గ్రామంలో
సచివాలయం, ఆర్ బి కె, వెల్ నెస్ సెంటర్,. డిజిటల్ లైబ్రరీ, జగనన్న కాలనీలు..
ఇంకా ఇలాంటివి ఎన్నో నెలకొన్నాయన్నారు. ఈ సమావేశంలో జెసిఎస్ కన్వీనర్లు సురంగి
నరసింగరావు, నక్క తులసీదాస్, ధర్మాన జగన్, కణితి సత్తి బాబు, ఎంపీపీలు ఆరంగి
మురళీధర్, వాన గోపి, జెడ్పీటీసీ చింతు అన్నపూర్ణ రామారావు, బీసీ కార్పొరేషన్
చైర్ పర్సన్లు రాజపు హైమావతి అప్పన్న, ముద్దాడ బైరాగి నాయుడు, రౌతు శంకర్రావు,
నియోజకవర్గంలో 91 సచివాలయాలకు చెందిన 271 మంది కన్వీనర్లు, పార్టీ ముఖ్య
నాయకులు తదితరులు పాల్గొన్నారు.