కరువుపనులకెళ్లిన కూలీలతో మాటామంతీ
పనులకు వచ్చేది బీసీ, ఎస్సీ, ఎస్టీలేనన్న కూలీలు
తమకు మజ్జిగ, ఓఆర్ఎస్ ఇవ్వడం లేదని ఆవేదన
మంగలి గూడెం , జులై 05: ఎర్రటి ఎండలోనూ పనిచేస్తూ.. వసతులు లేకున్నా
శ్రమిస్తున్న ఉపాధి హామీ కూలీలను పాలేరు నియోజకవర్గ బీఎస్పీ నాయకుడు డాక్టర్
అల్లిక వెంకటేశ్వరరావు పరామర్శించారు. క్షేత్ర స్థాయికి వెళ్లి పనిచేస్తున్న
డాక్టర్ అల్లిక.. అందులో భాగంగా బుధవారం ఉపాధి హామీ కూలీల సమస్యలను
తెలుసుకున్నారు. ఆ సందర్భంగా కూలీలు ఆయన వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు.
తీవ్ర ఎండలో పని చేస్తున్నారు కదా..? ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండడానికి
అధికారులు మీకు నిమ్మరసం, మజ్జిగ, ఓఆర్ ఎస్ ఇస్తున్నారా ? అని డాక్టర్
అల్లిక ఉపాధి కూలీలను అడిగారు. దానికి వారు లేదని చెప్పారు.
పనికి వస్తున్నది బహుజనులే..
ఉపాధి హామీ పనికి వెళ్తున్నవారిలో అత్యధికులు బీసీలు, ఎస్టీలు, ఎస్సీలేనని తన
పరిశీలనలో తేలిందని.. అగ్ర వర్ణాల వారు ఎందుకురావడం లేదని డాక్టర్ అల్లిక ఆరా
తీశారు. ఊరిలో తక్కువ కులం వారే నివసిస్తున్నారా? అని అన్నారు. ఇప్పటివరకు
ముఖ్యమంత్రులుగా చేసిన వారంతా అగ్రకులాల వారేనని.. వారి వారి సామాజిక వర్గాలను
అన్నిరకాలుగా ఆదుకోని బాగుచేశారని వ్యాఖ్యానించారు.. తక్కువ వర్గాల వారిని ఏ
మాత్రం పటించుకోలేదని.. వారిని అణచి వేస్తున్నరాని తెలిపారు.
ప్రవీణ్ కుమార్ సారథ్యంలో ప్రగతి
కేసీఆర్ బంగారు తెలంగాణ తెస్తానంటూ సీఎం అయ్యారని.. అది నిజమేనని ప్రజలూ
నమ్మారని కానీ, జరుగుతున్నది వేరని డాక్టర్ అల్లిక వెంకటేశ్వరరావు
పేర్కొన్నారు. తెలంగాణలో అంతా అయపోవడంతో ‘‘నేను ప్రధానమంత్రి అయితేనే బంగారు
తెలంగాణ వస్తది అని కేసీఆర్ అంటున్నారు’’ అని డాక్టర్ అల్లిక ఎద్దేవా చేశారు.
బడుగు, బలహీన వర్గాల వారికి న్యాయం జరగాలటే బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)
రాష్ట్ర అధ్యక్షడు ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు.
ప్రవీణ్ కుమార్ నాయకత్వాన్ని బలపరిచి గెలిపించుకుందామని కోరారు. తన ప్రజలపై
జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు చూడలేక ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఉద్యోగాన్ని
వీడి రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. ప్రజలకు న్యాయం జరగాలని ప్రజలకోసం
రాజకీయాల్లోకి వచ్చారన్నారు. అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాలని ప్రజలకు
పిలుపునిచ్చారు.