డక్కిలి : వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ జనవరి :26 భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా డక్కిలి మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, సచివాలయాల్లో త్రివర్ణ పథకాన్ని ఎగిరేసారు. తాహిశిల్దార్ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండాను ను అవగతం చేసి వందనాల సమర్పించారు. ఈ సందర్భంగా తాహిసిల్దార్ రమేష్ బాబు మాట్లాడుతూ భారతదేశ సమగ్రతకు సార్వభౌమత్వానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందించినటువంటి గొప్ప కానుక భారత రాజ్యాంగం అని అదేవిధంగా స్వాతంత్ర సమరయోధులు త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం భారతీయ తత్వమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రతి ఒక్కరు తమ వంతు కర్తవ్యం తో ప్రజలకు సేవలందించాలని అతి తమ బాధ్యతగా రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయడం ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలన్నారు. చిన్నతనం నుండి విద్యార్థులు అంకితభావంతో లక్ష్యం కోసం మంచి చదువులు చదువుకొని సమాజానికి తమ వంతు సేవలు చేయాలన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణలో సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది, ఎంఈఓ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో ప్రసన్నకుమారి, డీటీలు హరికృష్ణ,ప్రసన్న, ఏ ఎస్ ఓ వెంకటయ్య,మండల సర్వేయర్ సుబ్రహ్మణ్యం, సీనియర్ అసిస్టెంట్ సుధీర్ బాబు,ఆర్ఐ రాజేష్, వీఆర్వో నాగేంద్ర,గురుమూర్తి,విజయ్ కుమార్,నరసింహులు, మోహన్, హర్షవర్ధన్ రెడ్డి,కోటిరెడ్డి,ఆమని,పూజిత,పార్వతి,అనిత,పెంచలనరసయ్య,వెంకటేశ్వర్లు విజయ్ కుమార్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల కళాశాల విద్యార్థినులు ఈ జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు వారు వందేమాతరం దేశభక్తి గీతానికి అనుగుణంగా తమ నృత్య ప్రదర్శన చేశారు.