కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్.
ప్రజలను మోసగించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వైఎస్సార్ సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామకుమార్ రెడ్డి పేర్కొన్నారు. కలువాయిలో పొదుపు సంఘాలకు వైఎస్సార్ ఆసరా చెక్కులను పంపిణీ చేశారు. ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పొదుపు మహిళలతో కలిసి పాలాభిషేకం చేశారు..అనంతరం ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం నాలుగు విడతల్లో పొదుపు సంఘాల బకాయిలను చెల్లించారని తెలిపారు.రైతుల తోపాటు డ్వాక్రా సంఘాలను నిలువునా మోసిగిం చిన చరిత్ర చంద్రబాబుదన్నారు. మోసపూరిత హామీలను ఇచ్చి పబ్బం గడుపుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రజలను మోసగించాలనే ఉద్దేశంతో మాయమాటలు చెపుతున్నారని, ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు.గతంలో తన తల్లి నేదురుమల్లి రాజ్యలక్ష్మి మంత్రిగా పని చేసిన సమయంలో వెంకటగిరి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసారని అప్పట్లో కలువాయి వెంకటగిరి నియోజకవర్గంలో లేదని ఇప్పుడు వారి కుమారుడుగా నేను ఉన్నానని వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేది నేనేనని మీరందరూ ఓట్లేసి ఎమ్మెల్యే గా నన్ను ముఖ్యమంత్రి గా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని అశ్విర్వదిస్తే కలువాయి మండలంలో అభివృద్ధి అంటే ఏమిటో మీకు చూపిస్తానన్నారు, ఈ కార్యక్రమం లో డిఆర్డిఏ పిడి సాంబశివరెడ్డి, జడ్పిటిసి అనిల్ రెడ్డి మండల జెసిఎస్ కన్వీనర్ మాదాసు యజ్ఞ పవన్, ఎంపీపీ లక్ష్మీదేవి, మండల పార్టీ కన్వీనర్ కృష్ణారెడ్డి, ఏపీఎం స్రవంతి, అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు మండల వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు వెలుగు వివోఏలు వారి సిబ్బంది పాల్గొన్నారు.