విజయవాడ : సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషిచేసి వారి
హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన ఘనత దివంగత బెజవాడ ఎమ్మెల్యే వంగవీటి
మోహనరంగా నేనని, ఆ మహోన్నతుడి ఆశయ సాధనకు పార్టీలకు అతీతంగా ప్రతిఒక్కరూ కృషి
చేయాలని , విజయవాడ రాధా రంగా మిత్రమండలి కన్వీనర్ ఆకుల శ్రీనివాస్ కుమార్
పేర్కొన్నారు. పామర్రు నియోజకవర్గ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తో ఇంట్లో
గురువారం శ్రీనివాస్ ప్రత్యేక సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ ఆరాధ్య దైవంగా భావించే గొప్ప వ్యక్తి
విఎంఆర్ నేనన్నారు. ఆయన ఆనాడు అందించిన సేవలు తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఆయన
నిలిచిపోవడంతో పాటు అందరికి ఆదర్శం గా నిలుస్తున్నాయన్నారు .జులై 4న విజయవాడ
తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం నందు రంగా అభిమాన సంఘం ఆధ్వర్యంలో జరిగే
ఆదర్శ నేత వంగవీటి మోహన్ రంగా జయంతి కార్యక్రమంలో పామర్రు నియోజకవర్గం నుండి
రంగా అభిమానులతో పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఎమ్మెల్యే ని కోరారు. అనంతరం
వంగవీటి రంగా జయంతి కార్యక్రమానికి సంబంధించిన రంగా జయంతి ఆహ్వాన ప్రతిని
ఎమ్మెల్యే అనిల్ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ, వంగవీటి
అభిమానులు పాల్గొన్నారు.