జనసేన ఎన్నికల ప్రచార వాహనం వారాహిపై వైసీపీ నేతల కంగారు
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
విశాఖపట్నం : రాష్ట్ర విభజనపై వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలు క్షమాపణ
చెప్పాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్
చేశారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టి అయోమయస్థితిలోకి నెట్టేలా మాట్లాడుతున్నారని
ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన
మాట్లాడారు. ‘‘ఏపీ ఆస్తులను తెలంగాణకు కట్టబెట్టారు. ఇప్పుడేమో రాష్ట్ర
కలిసుంటే బాగుంటుందంటున్నారు. ప్రజలను అయోమయస్థితిలోకి నెట్టేలా వ్యాఖ్యలు
చేస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగులు ఒత్తిడిలో ఉన్నారు. వారు ఆత్మహత్యలు
చేసుకోవడం దారుణం. ప్రతి కుటుంబాన్ని మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు.
ఉద్యోగులకు మేం అండగా ఉంటాం’’ అని చెప్పారు. జనవరి 12న శ్రీకాకుళం జిల్లా
రణస్థలంలో జనసేన ఆధ్వర్యంలో యువజనోత్సవాన్ని వేడుకగా నిర్వహిస్తామని నాదెండ్ల
మనోహర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో అధినేత పవన్‌కల్యాణ్ పాల్గొంటారన్నారు.
జనసేన ఎన్నికల ప్రచార వాహనం వారాహిపై వైసీపీ నేతలు కంగారు పడిపోతున్నారని,
తాము నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని చెప్పారు.