పనిచేస్తోందని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత
అన్నారు. బుధవారం కొవ్వూరు టౌన్ లోని 18, 19వ వార్డుల్లో గడప గడపకు మన
ప్రభుత్వం 125వ రోజు కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం
అందిస్తున్న సంక్షేమ ఫలాలు ఏఏ స్థాయిలో , ఏఏ వర్గాలకు చెందుతున్నాయో, ఏమాత్రం
చెందుతున్నాయో అనే అంశాలపై హోంమంత్రి ఆరా తీసి అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలైన నవరత్నాలు
తదితర అంశాల్లో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆమె తెలిపారు. జయ జయ
ధ్వనాల మధ్య హోంమంత్రికి అడుగడుగునా జనం హారతులు పట్టారు. కొవ్వూరు పట్టణం
బాపూజీ నగర్ లోని ఆనంద లహరి అభ్యసన ఎంపీపీ స్కూల్ పిల్లలతో మంత్రి కాసేపు
ముచ్చటించారు. జగనన్న విద్యాకానుక, అమ్మఒడి తదితర పథకాలను వివరించి పిల్లలు
బాగా చదువుకుని మంచి అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎంతో దృఢ
సంకల్పంతో రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం
కార్యక్రమం ప్రజాధరణ పొందుతున్నదని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసమే గడప గడపకు
మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల్లో జగనన్న పై కలిగిన
నమ్మకం, భరోసాతో మా నమ్మకం నువ్వే జగన్ అనే నినాదం ప్రజల నుంచి
పుట్టుకొచ్చిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల అభివృద్ధి కోసం నాడు
నేడు, విద్యార్థుల కోసం అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, గోరుముద్ద వంటి ఎన్నో
కార్యక్రమాలను చేపట్టి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు.
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 98 శాతం పైగా నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్
మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రతి కుటుంబం లబ్ది చేకూరిందని
ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేయగా పలువురు తమ సమస్యలను హోంమంత్రి
దృష్టికి తీసుకురాగా వెంటనే పరిష్కరించాలని సంబందిత అధికారులను హోంమంత్రి
తానేటి వనిత ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, సచివాలయ
సిబ్బంది పాల్గొన్నారు.