తిరుమల: తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ దర్శించుకున్నారు.
ఇవాళ ఉదయం ఆయన కుటుంబ సమేతంగా స్వామివారి తోమాల సేవలో పాల్గొన్నారు..
ఇవాళ ఉదయం ఆయన కుటుంబ సమేతంగా స్వామివారి తోమాల సేవలో పాల్గొన్నారు..
తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు
చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని ఆయన మొక్కులు
చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు గడ్కరీ దంపతులకు
వేదాశీర్వచనం పలికారు. కేంద్రమంత్రికి ఛైర్మన్ సుబ్బారెడ్డి స్వామివారి
తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శన అనంతరం ఆలయం వెలుపల మీడియాతో గడ్కరీ
మాట్లాడారు. దేశం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో
ఉండాలని శ్రీవారిని కోరినట్లు చెప్పారు. ప్రజాసేవ చేసే శక్తిని తనకు
ప్రసాదించామని ప్రార్థించినట్లు గడ్కరీ తెలిపారు.