మచిలీపట్నం, సూర్య ప్రధాన ప్రతినిధి : ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన
ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం ఇదేనని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి
రమేష్ అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కృష్ణాజిల్లా గూడూరు
నియోజకవర్గంలోని ఆకులమన్నాడ శివారు గ్రామం రాముడిపేటలో బుధవారం సాయంత్రం ఎంతో
ఉత్సాహంగా ప్రారంభమైంది. తొలుత మంత్రి జోగి రమేష్ ఆకులమన్నాడ రైతు భరోసా
కేంద్ర చైర్మన్ బీరం రాజా ఇంటి నుంచి గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం
ప్రారంభించారు. ఆ తర్వాత బీరం పిచ్చిబాబు, బీరం శివయ్య, సజ్జల వెంకటేశ్వరరావు,
యక్కల కోటేశ్వరరావు, లంక నాగేశ్వరరావు, బాకీ రాజ్యలక్ష్మి, దొండపాటి రామకృష్ణ,
మామిడిబత్తుల నాగమణి, శివకవి సుబ్రమణ్యం,బాకీ వీరబాబు, కాయల రాజబాబు, బాకీ
సత్యనారాయణ, బాకీ సుబ్బయ్య, బీరం శేషయ్య, బీరం కృష్ణ ప్రసాద్, బాకీ వీర
రాఘవయ్య, బాకీ దివ్య నాగ సునీత, దొండపాటి రామంజమ్మ, దొండపాటి జ్యోతి, బాకీ
సౌజన్య, దొండపాటి వెంకటేశ్వరరావు తదితరుల ఇళ్లను మంత్రి సందర్శించారు.
ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను గూర్చి
వివరించారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ గ్రామస్తులతో మాట్లాడుతూ, జగనన్న
ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాజకీయాలకతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ
పథకాలను అందిస్తుండడం వల్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతం కులం మతం వర్గం
వంటి విభేదాలు చూడని నికార్సైన సంక్షేమ ప్రభుత్వమని ప్రజల్లో ప్రగాఢ విశ్వాసం
నమ్మకం బలంగా కలిగిందన్నారు. మున్ముందు సైతం ప్రభుత్వం ఇదే తరహాలో పనిచేసే
పేద బడుగు వర్గాల అభ్యున్నతికి తప్పక కృషి చేస్తుందని ఆయన చెప్పారు. వివిధ
పథకాల లబ్ధిదారులకు నేరుగా డబ్బులు అందిస్తూ, మధ్యవర్తులు, దళారీ వ్యవస్థ
లేకుండా అవినీతిరహిత పాలన అందించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాన
లక్ష్యమన్నారు.మన కోసం రేయంబగళ్ళు పాటుపడుతున్న ముఖ్యమంత్రికి మీరంతా బాసటగా
నిలవాలిని,మీ అందరి దీవెనలు,ఆశీర్వాదాలు ఆయనకు అంద చేయాలని మంత్రి జోగి రమేష్
ఈ సందర్భంగా గ్రామస్తులను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ
సభ్యుడు కోళ్ల లక్ష్మణరావు, ఆకులమన్నాడ వైయస్సార్సీపి గ్రామ కన్వీనర్ బాకీ
వీరబాబు, గూడూరు ఎంపిపి సంగా మధుసూదనరావు , గూడూరు జెడ్పిటీసి వేముల సురేష్
రంగబాబు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కారుమంచి కామేశ్వరరావు,
స్థానిక వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెడన 3 వ వార్డు కౌన్సిలర్ బళ్ళా
గంగయ్య, గూడూరు తహసీల్దార్ బి విజయ ప్రసాద్, ఎంపీడీవో డి. సుబ్బారావు,
స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
,కార్యకర్తలు,వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.