హోంమంత్రి తానేటి వనిత
కొవ్వూరు : కొవ్వూరు నియోజకవర్గంలోని కొవ్వూరు మండలం ఊనగట్ల లో 71 వ రోజు గడప
గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని హోంమంత్రి తానేటి వనిత నిర్వహించారు.
గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి లబ్ధిదారులకు
వివరించారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి
యోగక్షేమాలను తెలుసుకున్నారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో తమ
కుటుంబమంతా సంతోషంగా జీవిస్తున్నామని లబ్ధిదారులు ఆనందంగా తెలిపారు. ఈ
కార్యక్రమంలో భాగంగా గ్రామ సచివాలయ సిబ్బంది, అధికారుల పని తీరు గురించి
హోంమంత్రి ప్రత్యేకంగా తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు
పరిష్కరించాలని హోంమంత్రి తానేటి వనిత అధికారులను ఆదేశించారు.